అభిమానులతో మహేశ్ ‘ఒక్కడు’ చూసిన భూమిక.. కేరింతలతో మార్మోగిన థియేటర్..

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన బ్లాక్ బాస్టర్ పిక్చర్ ‘ఒక్కడు’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎం.ఎస్.రాజు ప్రొడ్యూస్ చేశారు. భూమిక హీరోయిన్ గా నటించగా, విలన్ రోల్ ను ప్రకాశ్ రాజ్ ప్లే చేశారు. మంగళవారం (ఆగస్టు 9) మహేశ్ బర్త్ డే సందర్భంగా ఓ థియేటర్ లో ‘ఒక్కడు’ స్పెషల్ షో వేశారు.

ఈ సినిమా చూసేందుకు మహేశ్ అభిమానులు థియేటర్ కు భారీ సంఖ్యలో వచ్చారు. టాకీసు మొత్తం అభిమానుల కేరింతలతో మార్మోగింది. ఇక ఈ టాకీసులోనే ‘ఒక్కడు’ ఫిల్మ్ హీరోయిన్ భూమిక కూడా ఉంది. ఆమె సైతం అభిమానులతో కలిసి సినిమా చూసింది. ఈ సందర్భంగా ఆమె అభిమానులకు అభివాదం చేసింది.

తను ధరించిన మాస్క్ తీసి అభిమానులకు నమస్కరించి ధన్యవాదాలు తెలిపింది భూమిక. తమ థియేటర్ లో భూమిక ఉందని తెలియగానే ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. చక్కటి నటన కనబర్చినందుకు భూమికకు థాంక్స్ చెప్పారు ఫ్యాన్స్.

భూమికను చూసి ఫ్యాన్స్ ఆమెకు హాయ్ చెప్తూ కేరింతలు కొట్టారు. మొత్తంగా ఆ టాకీసు వాతావరణం సందడిగా మారిపోయింది.

మహేశ్ బర్త్ డే సందర్భంగా పలు థియేటర్లలో ‘ఒక్కడు’, ‘పోకిరి’ సినిమాలను ప్రదర్శించారు. మహేశ్ ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళితో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల దర్శకత్వంలో సినిమాలు చేయనున్నారు.