నాని దసరా ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్‌.. ఎప్పుడంటే..?

-

మొదటిసారి నాని తన క్లాస్ స్టైల్ వదిలేసి ‘దసరా’ సినిమాతో పూర్తి స్థాయి మాస్‌ యాక్షన్‌ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సుకుమార్‌ శిష్యుడు శ్రీకాంత్‌ ఓదెలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ నేపధ్యం లో చిత్రబృందం వరుస అప్‌డేట్‌లు ఇస్తూ సినిమాపై జనాలలో క్రేజ్ పెంచుతుంది. ఇప్పటికే రిలీజైన పాటలు ఇన్‌స్టాంట్‌గా ప్రజల నోట్లో వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా మేకర్స్‌ ఈ సినిమా ట్రైలర్‌ అప్‌డేట్‌ను కూడా వదిలారు. దసరా ట్రైలర్‌ను మార్చి 14న రిలీజ్‌ చేస్తున్నట్లు తెలిపారు. కాలిపోతున్న రావణాసురుడి బొమ్మ ముందు రెండు గొడ్డల్లు పట్టుకుని ఉన్న నాని పోస్టర్‌ పిచ్చెక్కిస్తుంది. టీజర్‌తో భారీ సంచలనం సృష్టించిన దసరా.. ట్రైలర్‌తో ఇంకెంత విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి. అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన దసరా సినిమాలో నానికి జోడీగా కీర్తిసురేష్‌ నటిస్తుంది.

Dasara trailer date locked for national level release - Telangana Today

నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా మార్చి 30న పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ అవ్వనుంది. ఇప్పటికే దసరా సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్‌ జరిగిందని. టాలీవుడ్‌లో వినిపిస్తున్న లెక్కల ప్రకారం దసరా సినిమాకు అన్ని హక్కులకు కలిపి రూ.80 కోట్ల వరకు బిజినెస్‌ జరిగింది. ఇక ఈ సినిమా బడ్జెట్‌ రూ.65 కోట్లు ఈ లెక్కన చూసుకుంటే నిర్మాతలు ఆల్రెడీ రూ.15 కోట్ల ప్రాఫిట్‌లో ఉన్నట్టే. ఇక నాని మొదటి సారి ఫుల్‌ లెంగ్త్‌ ఊరమాస్‌ క్యారెక్టర్‌ చేస్తుండటంతో అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన ఆసక్తి కనబడుతుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news