టైటిల్ చెప్పగానే అదిరిపోయిందన్న మహేశ్..సూపర్ స్టార్ కోసమే ‘సర్కారు వారి పాట’

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా..డెఫినెట్ గా సూపర్ హిట్ అని, తాను కాన్ఫిడెంట్ గా ఉన్నానని ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో దర్శకుడు పరశురామ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సినిమా సక్సెస్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని, ‘సర్కారు వారి పాట’ పుట్టిందే మహేశ్ బాబు కోసమని పరశురామ్ చెప్పుకొచ్చారు. లవ్ స్టోరి, యాక్షన్, కామెడీ ఎలిమెంట్స్ మేళవింపుతో పాటు సూపర్ స్టార్ పైన ఉన్న గౌరవాన్ని పదిరెట్లు పెంచే విధంగా తాను సినిమా తీశానని పరశురామ్ అన్నారు.ఇక ఈ సినిమా స్టోరి నచ్చడం వల్లే మహేశ్ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారని స్పష్టం చేశారు.

ఇక ఈ టైటిల్ ‘సర్కారు వారి పాట’ గురించి కూడా ఆసక్తికర విషయాలు తెలిపారు పరశురామ్. తాను తొలుత సినిమా స్టోరి అనుకున్నానని, కానీ, టైటిల్ గురించి పెద్దగా ఆలోచించలేదన్నారు. కృష్ణ బర్త్ డే మే 31న టైటిల్ పోస్టర్ రివీల్ సందర్భంగా..మహేశ్ బాబు తనతో మాట్లాడుతూ టైటిల్ గురించి అడగగా, తాను అప్పుడు ‘సర్కారు వారి పాట’ అని చెప్పానని వివరించారు పరశురామ్.

అలా ఈ పిక్చర్ కు టైటిల్ ఫిక్స్ అయిన సంగతి తెలిపారు. ఈ చిత్రంలో మహేశ్ బాబు, కీర్తి సురేశ్ హీరో, హీరోయిన్స్ కాగా, ప్రధాన పాత్రల్లో సముద్రఖని, నదియా, కిశోర్ తదితరులు నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news