విక్కీ కౌశల్‌ను మించిన ఆస్తి కత్రినా సొంతం..ఆమె ఆస్తుల నెట్‌వర్త్ ఎంతంటే?

-

బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కత్రినా కైఫ్..విక్కీ కౌశల్ ను మ్యారేజ్ చేసుకున్న సంగతి అందరికీ విదితమే. లవ్ బర్డ్స్ గా కొంత కాలం వీరు సీక్రెట్ రిలేషన్ షిప్ చేయగా, చివరకు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సంగతులు పక్కనబెడితే..తన భర్త విక్కీ కౌశల్ కంటే కూడా కత్రినా కైఫ్ ఆస్తుల విలువ ఎక్కువ మొత్తంలో ఉందని వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో ఇంతకీ ఆమెకున్న ఆస్తుల విలువ ఎంతనో ఇప్పుడు తెలుసుకుందాం.

 

బీ టౌన్ లో స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా యాక్ట్ చేసిన కత్రినా కైఫ్…తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఇండస్ట్రీలో ఏర్పరుచుకుంది. ఇక ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఈమెకు ఎక్కువనే అని చెప్పొచ్చు. ఒక ఫిల్మ్ కు కత్రినా తీసుకునే రెమ్యునరేషన్ కూడా ఎక్కువగా నే ఉంటుంది.

కత్రినా కైఫ్ ఒక్క మూవీకి రూ.10 నుంచి 11 కోట్లు తీసుకుంటుందని బీ టౌన్ సర్కిల్స్ టాక్. ఆ రకంగా ఏడాదికి దాదాపుగా కత్రినా కైఫ్..రూ.20 నుంచి 25 కోట్ల వరకు సంపాదిస్తుందట. ఇక కత్రినా కైఫ్ పలు ప్రొడక్ట్స్‌కు..బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం ద్వారా కూడా బాగానే సంపాదిస్తోంది. అలా మొత్తంగా ఆమెకు సంవత్సరం ఆదాయం దాదాపుగా రూ.200 కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది.

కత్రినా భర్త విక్కీ కౌశల్.. ఆదాయం మాత్రం 20 కోట్లు ఉంటుందని అంచనా. విక్కీ ఒక్క మూవీకి రూ.2 నుంచి 4 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటారట.అలా ఏ రకంగా చూసినా..కత్రినా కైఫ్ ఆస్తుల విలువ తన భర్త కంటే చాలా ఎక్కువని టాక్ నడుస్తోంది. మొత్తానికి విక్కీ కౌశల్ వెరీ లక్కీ అని ఈ వార్త చదివిన కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. కత్రినా కైఫ్ ఆస్తుల నెట్ వర్త్ అంతనా? అని కొందరు ఆశ్చర్యపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news