చిరంజీవి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఫాదర్’ అప్‌డేట్ ఇచ్చేసిన డైరెక్టర్..

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ పిక్చర్ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ క్రమంలోనే నెక్స్ట్ ఫిల్మ్ ‘గాడ్ ఫాదర్’ పైన మెగా ఫ్యాన్స్ హోప్స్ పెట్టుకున్నారు. మలయాళం సూపర్ హిట్ ఫిల్మ్ ‘లూసిఫర్’కు అఫీషియల్ తెలుగు రీమేక్ గా వస్తున్న ఈ పిక్చర్ డెఫినెట్ గా హిట్ కావాలని అంటున్నారు. ఈ క్రమంలోనే చిత్ర అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్న క్రమంలో తాజాగా దర్శకుడు మోహన్ రాజా అప్ డేట్ ఇచ్చేశారు.

సోషల్ మీడియా వేదికగా ‘గాడ్ ఫాదర్’ పిక్చర్ లోని స్పెషల్ సాంగ్ షూట్ జరుగుతున్నదని పేర్కొన్నారు. ఈ సాంగ్ కు కింగ్ ఆఫ్ డ్యాన్స్ ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తు్న్నారని, మెగాస్టార్స్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ స్టెప్పులేస్తున్నారని తెలిపారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ డెఫినెట్ గా రికార్డులను తిరగరాస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు మేకర్స్.

చిరంజీవి..‘రాజా విక్రమార్క’ చిత్రంతో ప్రభుదేవాను కొరియోగ్రాఫర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ తర్వాత వీరు పలు పాటలు చేశారు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ‘గాడ్ ఫాదర్’ కోసం కొలాబరేట్ అయ్యారు.

ఈ సాంగ్ లో వెరీ డిఫరెంట్ గా ప్రభుదేవా స్టెప్స్ కంపోజ్ చేశారని తెలుస్తోంది. ప్రభుదేవా కొరియోగ్రఫీలో చిరంజీవి, సల్లూ భాయ్ స్టెప్స్ నెక్స్ట్ లెవల్ లో ఉంటాయని అంటున్నారు. నయనతార ఇందులో చిరంజీవికి చెల్లెలిగా నటిస్తుండగా, సునీల్, సత్యదేవ్ , సల్మాన్ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news