‘లైగర్’ స్టోరి ఎలా పుట్టిందో చెప్పేసిన పూరీ జగన్నాథ్..

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్’ ఈ నెల 25న విడుదల కానుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా నటించిన ఈ చిత్రంపైన భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఇక ప్రమోషన్స్ లో మూవీ యూనిట్ సభ్యులు ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా డ్యాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ను .. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలోనే ‘లైగర్’ ఫిల్మ్ స్టోరి పుట్టుక గురించి పూరీ జగన్నాథ్ చెప్పారు.

‘లైగర్’ సినిమా కోసం కథ ఆలోచన ఎలా వచ్చింది? అని సుకుమార్ ప్రశ్నించారు. తనకు ‘లైగర్’ ఫిల్మ్ స్టోరి థాట్ అల్లు అర్జున్ వలన వచ్చిందని చెప్పారు పూరీ.

బన్నీతో ‘ఇద్దరమ్మాయిలతో’ షూటింగ్ చేస్తున్నపుడు హాలీవుడ్ డైరెక్టర్ ఒకరు తను చేసే సినిమాల్లో హీరోలకు ఏదో ఒక వికలాంగత్వం పెట్టి సినిమా చేస్తాడని చెప్పాడు. అలా మీరు కూడా ఒక సినిమా చేయాలని పూరీ జగన్నాథ్ కు బన్నీ సలహా ఇచ్చాడు.

అలా మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) నేపథ్యంలో నత్తితో కూడిన క్యారెక్టరైజేషన్ తో ‘లైగర్’ స్టోరి రాసుకున్నట్లు పూరీ జగన్నాథ్ తెలిపారు.

Sukumar Big Deal with Eros International

పదేళ్ల కిందట ఈ కథను రాసుకున్నట్లు వివరించారు. ఈ సినిమా డెఫినెట్ గా సక్సెస్ అవుతుందని పూరీ జగన్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఇందులో కీలక పాత్ర పోషించారు. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ పిక్చర్ కు అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి.