ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు మెచ్చిన సీనియర్ ఎన్టీఆర్ చిత్రమిదే..

-

సీనియర్ ఎన్టీఆర్.. తెలుగు ప్రజల ఆరాధ్యుడు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెండితెరపైనే కాదు నిజ జీవితంలోనూ ఆయన హీరోగా ఉండిపోయారు. సినీ రంగంలో విశేష సేవలు అందించిన అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్.. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలందించారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా రాజకీయ పార్టీ స్థాపించి తొమ్మిది నెలలలోనే అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించారు.

కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను ఏకం చేయడం కోసం సీనియర్ ఎన్టీఆర్ తన వంతు ప్రయత్నం చేశారు కూడా. సీనియర్ ఎన్టీఆర్ ను ప్రజలు దేవుడిగా ఆరాధించారు. పౌరాణిక పాత్రలతో పాటు జానపద, సాంఘీక, ప్రేమ కథా చిత్రాలు కూడా చేసిన ఎన్టీఆర్..ఎంతో మందికి ఆరాధ్య నటుడు. ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు నీలం సంజీవరెడ్డి..కి సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఆ చిత్రం చాలా ఇష్టం.

పార్టీ వేరు అయినప్పటికీ సీనియర్ ఎన్టీఆర్ అంటే నీలం సంజీవరెడ్డికి చాలా గౌరవం ఉండేది. ఏపీలో పలు కీలక పదవులు అలంకరించిన నీలం సంజీవరెడ్డి ఆ తర్వాత కాలంలో రాష్ట్రపతి గా పని చేశారు. దేశ ప్రథమ పౌరుడి హోదాలో ఉన్న ఆయన ఢిల్లీలో ఉన్నప్పటికీ తెలుగు సినిమాలను రెగ్యులర్ గా చూసేవారు.

ఒకసారి ఏపీకి వచ్చిన సమయంలో నీలం సంజీవరెడ్డి.. సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘సర్దార్ పాపరాయుడు’ ఫిల్మ్ ను స్పెషల్ షో వేసుకుని వీక్షించారు. సినిమా చాలా బాగుందని చూసిన తర్వాత ప్రశంసల వర్షం కురిపించారు. బ్రిటీష్ వారి అక్రమాలను ఎదిరిస్తూ ఎన్టీఆర్ నటించిన తీరు తనకు చాలా బాగా నచ్చిందని పేర్కొన్నారు. ఈ విషయమై ఆయన తన స్వదస్తూరిలో ప్రశంసా పత్రాన్ని రాసి ఇచ్చారు. ఆ పత్రం రామకృష్ణ థియేటర్ లో ఉందట. అలా సీనియర్ ఎన్టీఆర్ సినిమాను చూసి అప్పటి రాష్ట్రపతి అయిన నీలం సంజీవరెడ్డి ఫిదా అయిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news