ధనస్సు రాశి | ఉగాది పంచాంగం | శ్రీ వికారినామ సంవ‌త్స‌రం 2019 రాశి ఫ‌లాలు

శ్రీ వికారినామ సంవ‌త్స‌రం ధనస్సు రాశి రాశిఫ‌లాలు

మూల 1,2,3,4 పాదాలు, పూర్వాషాఢ- నాలుగుపాదాలు
ఉత్తరాషాఢ- 1వ పాదం
ఆదాయం-2 వ్యయం-8
రాజపూజ్యం-6 అవమానం-1
ఈరాశివారికి గురువు జన్మంలో, వ్యయంలో సంచరిస్తాడు. దీనివల్ల నిరంతరం జీవన పోరాటం సాగును, ఏది చేసినా అవమానం ఎదురగును. అనుకోని మార్పులు, ఆధ్యాత్మిక చింతను పెరుగుతుంది. సంతానం సాధించే విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. శని జనవరి 24 వరకు జన్మంలో ఉంటాడు. స్తిర ఆలోచనలు ఉండవు, ఆనారోగ్య సూచనలు, తర్వాతి రెండిటకి వెళ్లిన తర్వాత ధనం సమయానికి అందుతుంది. విలువ పెరుగుతుంది. రాహు, కేతువులు వల్ల కళత్ర అనారోగ్యం, నిలకడ లేమి ఉంటాయి. స్వప్రయోజనాలకు కాకుండా ఇతరులకు ప్రయోజనం చేస్తారు.

ఈరాశి గ్రహపరిశీలన తర్వాత… మొత్తం మీద అనుకున్న పనులు ఆలస్యమైనా నెరవేర్చుకుంటారు. కొత్త పెట్టుబడులు పెట్టి ఆదాయాన్ని పొందుతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలం. ఆకస్మిక ప్రయాణాలు, ధనలాభం ఉంటుంది. సోదర, బంధువర్గం నుంచి సహాయాలు అందుతాయి. వ్యవసాయదారులకు వేసిన పంటలు కలిసి వచ్చును. విద్యార్థులకు ధనం ఖర్చుచేసి సీట్లను సంపాదిస్తారు. వ్యాపారులకు ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. కాంట్రాక్టర్లు, ఫైనాన్స్ రంగం వారికి ఆదాయం పుష్కలం. ప్రొఫెషనల్ రంగంలోని వారికి ఉన్నచోటు కంటే ఇతర ప్రాంతాల్లో పేరు వస్తుంది. కంప్యూటర్ రంగంలో వారికి శుభప్రదంగా ఉంటుంది.ఈ రాశి స్త్రీలకు ప్రభుత్వ మూలక సహాయం అందుతుంది. పారిశ్రామికంగా అభివఋద్ధి చెందుతారు.

Ugadi Panchangam 2019 Dhanush rashi Rashi Phalalu
Ugadi Panchangam 2019 Dhanush rashi Rashi Phalalu

చైత్రమాసంలో ప్రధాన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ప్రారంభించిన ప్రతి పనిని శ్రద్ధతో, ప్రణా-ళికతో చేయాలి. లేని పక్షంలో అనవసరమైన ఆటం-కాలు ఎదురవుతాయి. ఆర్థిక విషయాలలో ఇబ్బం-దులు. వైశాఖ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని పనులు వాయిదా పడడము. ఇత-రులకు సలహాలు ఇవ్వడం గానీ, తీసుకోవడం గానీ అంత మంచిది కాదు. జ్యేష్టమాసంలో ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శ్రమాధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. భార్యాపిల్లలతో సంతో-షము. నలుగురిలో మంచి పేరును పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. అన్నదమ్ములతో కొన్ని పనులు నెరవేరుతాయి. ఆషాఢ మాసంలో గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నది. ఉద్యోగస్తులు పై అధికారులతో ఓర్పుతో ఉండడం మంచిది. అనుభవజ్ఞులు, పెద్దల సహాయ సహకారాలు తీసుకోవాలి. శ్రావణ మాసంలో పనులలో ఫలితాలు సామాన్యంగా వుంటాయి. భాద్రపద మాసంలో ప్రారంభించిన పనులు మెల్లిగా ముందుకు సాగుతాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగాన్వేషణలో ఉన్నవారు పట్టుదలతో ముందుకు సాగితే సత్ఫలితాలను పొందుతారు. వ్యాపారస్తులకు నిత్య క్రయ విక్రయాలలో ఓపిక అవసరము. పనివారితో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. పనులలో తొందరపాటు కాకుండా సంయమ-నంతో ముందుకు వెళ్లడం అన్ని విధాల మంచిది. ఆశ్వీయుజ మాసంలో భార్యాపిల్లలతో సౌఖ్యంగా వుంటారు. అన్ని విషయాలు చర్చించే సానుకూలత ఉంటుంది.

కార్తీక మాసంలో ప్రారంభించిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. శుభకార్యాల విషయంలో చేసే ప్రయత్నాలు మెల్లిగా ముందుకు సాగినా కొంత ప్రోత్సాహకరమెన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తు-లకు అధికారుల ఆదరణ ఉంటుంది. సమాజంలో మంచి వ్యక్తుల సహాయ సహకారాలు వుంటాయి. మార్గశిర మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులు ఆటంకాలతో పూర్తవుతాయి. పౌష్య మాసంలో వృధా ఖర్చులు ఉంటాయి. వాహనముల విషయంలో అనవసరమైన ఖర్చులు ముందుకు వస్తాయి. మాఘ మాసంలో మొదటి రెండు వారాలలో పనులలో ఆటంకాలు. మూడు, నాలుగు వారాలలో క్రమేపీ అనుకూలత ఉంటుంది. స్వయంవృత్తి, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగా-లలో ఉన్న వారు సంతృప్తిగా ఉంటారు. ఆఫీసులో మంచి పేరును పొందుతారు. ఫాల్గుణంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఖర్చులకు సరిపడా ఆదాయం ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.

– కేశవ

మిగ‌తా రాశుల‌ను తెలుసుకోవాలంటే ఈ క్రింది వాటిని క్లిక్ చేయండి..

మేషం
మేషం
వృషభం
వృషభం
మిథునరాశి
మిథునరాశి
కర్కాటకం
కర్కాటకం
సింహం
సింహం
కన్య
కన్య
తుల
తుల
వృశ్చికం
వృశ్చికం
ధనుస్సు
ధనుస్సు
మకరం
మకరం
మీన‌రాశి
మీన‌రాశి
కుంభరాశి
కుంభరాశి