జగన్ ఏపీలోకి సీబీఐ ఎంట్రీకి అనుమతి ఇచ్చేందుకు చంద్రబాబు చేసిన చట్ట సవరణను రద్దు చేస్తారని తెలుస్తోంది. ఈ నెల 8వ తేదీన జగన్ నిర్వహించే సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంటారని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని వ్యవస్థల ప్రక్షాళన దిశగా ముందుకు కదులుతున్నారు. ప్రమాణ స్వీకారం రోజున వైఎస్సార్ పెన్షన్ పథకం ఫైలుపై తన తొలి సంతకం చేసిన జగన్.. మరోవైపు పాలనలోనూ వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తున్నారు. సీఎంగా ప్రమాణం చేయకముందు ఢిల్లీకి వెళ్లి మోదీ, అమిత్‌షాలను కలసిన జగన్.. మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాజధాని అమరావతిలో జరిగిన భూదందాను బయటకు తీసుకువస్తానని, ఆ స్కాంలో ఎవరున్నా వదిలిపెట్టేది లేదని చెప్పారు. దీంతో ఇప్పుడు ఆ విషయంపై అన్ని వర్గాల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది.
గతంలో టీడీపీ ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో అప్పటి సీఎం చంద్రబాబు ఏపీలోకి సీబీఐ ఎంట్రీని నిషేధిస్తూ చట్ట సవరణ చేశారు. అయితే జగన్ ఇప్పుడా చట్ట సవరణను రద్దు చేస్తారని ప్రచారం సాగుతోంది. సీబీఐని ఏపీలోకి తిరిగి రప్పించడం ద్వారా అమరావతిలో జరిగిన భూముల స్కాంపై విచారణ చేపట్టి టీడీపీకి షాక్ ఇవ్వాలని జగన్ చూస్తున్నారని తెలిసింది. సాధారణంగా దేశంలో సీబీఐ ఏ రాష్ట్రంలోనైనా తాను చేపట్టే కేసుల విషయమై విచారణ ఛేయాలనుకుంటే.. ముందుగా ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఏపీలోకి సీబీఐ రావడంపై ఆంక్షలు విధించారు. దీంతో ఏపీలోకి సీబీఐ ఎంట్రీ బ్లాక్ అయింది.
అయితే జగన్ మాత్రం ఏపీలోకి సీబీఐ ఎంట్రీకి అనుమతి ఇచ్చేందుకు చంద్రబాబు చేసిన చట్ట సవరణను రద్దు చేస్తారని తెలుస్తోంది. ఈ నెల 8వ తేదీన జగన్ నిర్వహించే సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంటారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే సీఎంగా ప్రమాణం చేసిన కొన్ని రోజులకే పరిపాలనలో వేగం పెంచిన జగన్ మరోవైపు అమరావతి భూముల స్కాంలోనూ దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. మరి ఏపీలోకి సీబీఐ ఎంట్రీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి జగన్ ఆ భూముల స్కాం కేసును సీబీఐకి అప్పగిస్తారా, లేదా అన్న వివరాలు తెలియాలంటే.. మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు..!