ఎడిట్ నోట్: ముందస్తుపై టెన్షన్.!

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున నడుస్తోంది..ప్రతిపక్ష పార్టీలు మాత్రం ముందస్తు ఎన్నికలు వస్తాయని, రెడీగా ఉండాలని తమ పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నాయి. ఎప్పటినుంచో టి‌పిసి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. అసలు ఈయన మొదట ముందస్తు గురించి చెబుతున్నారు. కేసీఆర్ ఈ పరిస్తితుల్లోనైనా మళ్ళీ ముందస్తుకు వెళ్లాలని చూస్తున్నారని చెబుతున్నారు.

ఈ మధ్య కూడా కే‌సి‌ఆర్ ఫిబ్రవరిలో ప్రభుత్వాన్ని రద్దు చేసి..ఏప్రిల్ లోపు ఎన్నికలు ముగించేయాలని చూస్తున్నారని అన్నారు. అటు బి‌జే‌పి నేతలు సైతం ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అటు అమిత్ షా లాంటి వారు కూడా ముందస్తు ప్రస్తావన తెస్తున్నారు. ఇక టీడీపీ,  వైఎస్సార్టీపీ పార్టీలు సైతం ముందస్తు ఎన్నికలని మాట్లాడుతున్నాయి. కానీ ముందస్తు ఎన్నికలపై అధికార బి‌ఆర్‌ఎస్ నేతలు మాత్రం వేరేగా స్పందిస్తున్నారు. ఎట్టి పరిస్తితులోనూ ముందస్తుకు వెళ్ళే అవకాశం లేదని, పూర్తిగా కాలం ప్రభుత్వంలో ఉంటామని అంటున్నారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని చెబుతున్నారు.

రేవంత్ ఇలాకాపై బండి ఫోకస్..! | Manalokam

అంటే షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే..డిసెంబర్ లో ఎన్నికలు జరుగుతాయి. కానీ కేసీఆర్‌ని నమ్మడానికి లేదని ఆయన ఏ సమయంలోనైనా ముందస్తుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాబట్టి ముందస్తు ఎన్నికలకు రెడీగా ఉండాలని ఇటు కాంగ్రెస్, అటు బి‌జే‌పి సిద్ధమవుతున్నాయి. ముందస్తు కోసమే కే‌సి‌ఆర్ ఇప్పుడు జనంలో తిరుగుతున్నారని, భారీ సభలు పెడుతున్నారని, కొత్త కార్యక్రమాలు చేస్తున్నారని అంటున్నారు. తాజాగా కంటివెలుగు కార్యక్రమం ముందస్తు ఎన్నికల్లో భాగంగా అమలు చేసిందనే అని ప్రతిపక్షాలు అంటున్నాయి.

అయితే రాజకీయ పరిస్తితులని బట్టి కే‌సి‌ఆర్ ముందస్తుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎలాగో డిసెంబర్ లో ఎన్నికలకు వెళితే…ఏప్రిల్ లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా రాను రాను తమపై వ్యతిరేకత పెరుగుతుందనే భావన కే‌సి‌ఆర్ లో వస్తే..ముందస్తుపై ఆలోచన చేసే ఛాన్స్ ఉంది. మొత్తం సర్వేల బట్టే కే‌సి‌ఆర్ ప్లాన్ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి బి‌ఆర్‌ఎస్ వర్గాల నుంచి ముందస్తు ప్రచారం కనిపించడం లేదు. చూడాలి మరి ఈ ముందస్తు ఎన్నికలు జరుగుతాయో లేదో.