ఈ పండ్లతో ఆరోగ్యమే కాదు.. అందం కూడా!

-

వయసు చిన్నదే.. కానీ ముఖం మాత్రం పెద్దవారిలా కనిపిస్తుంది. కారణం చర్మం ముదిరినట్లుగా కనిపించడం. అలా అవ్వడానికి కారణం తినే ఆహారంలో చర్మ ఆరోగ్యాన్ని పెంచే ఆహారాలు లేకపోవడం. కాలుష్యం వంటి కారణాలవల్ల చర్మం పొడిబారడం, తక్కువ వయసులోనే ముడతలు పడడం వల్ల కాంతిహీనంగా తయారవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఏవేవో తినాల్సిన అవసరం లేదు ఆరోగ్యాన్ని కాపాడుకునే పనిలో భాగంగానే అందాన్ని పెంచే కొన్నిరకాలపండ్లు తింటే సరిపోతుంది. ఆ పండ్లేంటో ఇప్పుడు తెలుసుకోండి.

యాంటీఏజింగ్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన కూరగాయలు, పండ్లు తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండడంతోపాటు చర్మంపై ముడతలు, చర్మంవదులుగా మారడం వంటి లక్షణాలు తగ్గుతాయి.
– కివీపండు : ఈ పండులో విటమిన్-సి సమృద్దిగా దొరుకుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చార్మానికి కావలసిన పోషకాలను అందించి చర్మం మీద ముడతలు నివారిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.

 దానిమ్మపండు : కివీపండుతో పాటు తరచూ దానిమ్మగింజలు, దానిమ్మ జ్యూస్ తీసుకోవడం వల్ల చర్మకణాలకు కావలసిన పోషకాలు అందిస్తున్నది. చర్మానికి కావాల్సిన యాంటీ ఏజింగ్ లక్షణాలను సమృద్దిగా కలిగి ఉంటుంది. ఇది చర్మానికి కావాల్సిన పోషణను అందించి ముఖంపై గ్లో వచ్చేలా సహాయపడుతుంది.

 పుచ్చకాయ : వేసవిలో దొరికే పుచ్చకాయ, శీతాకాలంలో కూడా మార్కెట్లో కనివిందు చేస్తుంటాయి. ఇది కావాల్సిన పోషకాలను అందించి చర్మం ముడతలు పడకుండా నివారిస్తుంది. ఇది చార్మానికి కావాల్సిన తేమను అందించి డీహైడ్రేషన్ ఆరిన పడకుండా చూస్తుంది. పచ్చకాయ గింజల్లో కూడా చర్మ సౌందర్యానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

 ద్రాక్షపండు : ఏ సీజన్‌లో అయినా ద్రాక్షపండ్లు దొరుకుతాయి. ఇది చర్మ సౌందర్యాన్ని పెంచడంలో ఎంతో దోహదపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఫ్రీరాడికల్స్‌తో పోరాడి వయసు పెరగడం వల్ల వచ్చే చర్మలక్షణాలను తగ్గిస్తుంది.

 ఆపిల్ : ఎక్కడో పండిన ఆపిల్స్ మనరాష్ర్టాల వారిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆపిల్స్‌లో చర్మం ముడతల సమస్యను ఎదుర్కొనే లక్షణాలు అధికంగా ఉన్నాయి. తరచుగా ఆపిల్స్‌ని తిన్నా లేదా వాటి గుజ్జును చర్మానికి ఐప్లె చేసుకున్నా వృద్ధాప్యపు గుర్తులను తగ్గించుకోవచ్చు. ఇందులో ఉన్న పోషకాలు, యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మాన్ని తాజాగా ఉంచుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news