బరువు తగ్గడానికి బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవాల్సిన ఆహారాలు..

-

బరువు తగ్గాలన్న ఆలోచనతో బ్రేక్ ఫాస్ట్ తీసుకోని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఒక పూట ఆహారం తగ్గిస్తే ఆటోమేటిక్ గా బరువు తగ్గుతారని ఆశపడతారు. ఇలాంటి నిర్ణయాలు అందరికీ పనిచేయకపోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరికీ ఒక్కోలా శరీర క్రియ జరుగుతుంది. కాబట్టి, మీకు సరిపోయే ప్రక్రియను మీరు ఎంచుకోవాలి. లేదంటే అనవసర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం వల్ల తలనొప్పి, అలసటగా అనిపించడం జరుగుతుంది. బరువు తగ్గాలనుకునే సమయంలో ఇలాంటి అనవసర ఇబ్బందులని తలెక్కించుకోవడం అనవసరం. అందుకే బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటూనే అందులో ఆహారాలను మార్చడం ద్వారా బరువు తగ్గవచ్చు. ఆ ఆహారాలేమిటో ఇక్కడ చూద్దాం.

నట్ బట్టర్

బాదం, వేరుశనగ, వాల్ నట్స్ మొదలగు వాటితో చేసిన బట్టర్ లో మంచి కొవ్వు ఉంటుంది. అది శరీరానికి మేలు కలిగిస్తుంది. ఇంకా, అందులో ఉండే ప్రోటీన్ కారణంగా బరువు తగ్గడంతో పాటు ఇతర వ్యాధుల నుండీ ఉపశమనం కలుగుతుంది.

గుడ్లు

గుడ్డులో 6గ్రాముల ప్రోటీన్, 70కేలరీలు ఉంటాయి. ఇందులో ఉండే అధిక ప్రోటీన్ కారణంగా శరీరానికి మంచి ఆరోగ్యం అందుతుంది.

తీపి లేని పెరుగు

ప్రోబయోటిక్స్, అధిక కాల్షియం గల పెరుగుని బ్రేక్ ఫాస్ట్ లో భాగం చేసుకోవడం చాలా మంచిది. ఇందులో ఉండే పోషక విలువలు జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.

చియా విత్తనాలు

గింజల్లో అన్నింటికంటే అత్యుత్తమమైనవి చియా విత్తనాలే అని చెప్పాలి. అధిక ఫైబర్, కాల్షియం ఉండడంతో శరీరానికి మేళు చేస్తాయి.

అరటి పండు

పొటాషియం ఎక్కువగా ఉండే అరటి పండులో అనేక పోషకాలు ఉంటాయి. ప్రేగుల్లో కదలికను ఏర్పర్చి మెదడు మంచి సంకేతాలను పంపిస్తుంది. దానివల్ల మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. బ్రేక్ ఫాస్ట్ లో అరటి పండుని చేర్చుకోవడం వల్ల బరువు పెరగకుండా ఉండడమే కాదు బీపీ కూడా నియంత్రణలో ఉంటుంది.

ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తీసుకోకపోతే ఈ సమస్యలు వస్తాయి..!

Read more RELATED
Recommended to you

Latest news