గర్భిణులు గ్రీన్‌ టీ తాగొచ్చా..? తాగితే వచ్చే నష్టాలు ఇవే..!

-

గ్రీన్‌ టీ తాగడం ఆరోగ్యానికి మంచిదని అందిరకీ తెలిసిన విషయమే.. అయితే అతిగా తాగితే అనవసరమైన సమస్యలు వస్తాయనేది మాత్రం కొందరికే తెలుసు. బరువు తగ్గాలనుకునేవారు..ఇతర టీలు మానేసి.. డైలీ గ్రీన్‌ టీ తాగాలని నిపుణులు చెప్తారు. తాగమన్నారు కదా అని మాములు టీ తాగినట్లు రోజులు మూడు నాలుగు సార్లు తాగితే అంతే సంగతులు. గర్భిణులు గ్రీన్‌ తాగొచ్చా..? ఆ టైంలో రెగ్యులర్‌గా చేసేవే అయినా మనకు కొన్ని నష్టాలను తెచ్చిపెడతాయి..మరీ..ఈ టీవల్ల ఏం జరుగుతుందో చూద్దాం.!

గర్భదారణ సమయంలో గ్రీన్‌ టీ తాగే ఆలవాటు మానుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. గ్రీన్ టీ తాగటం అన్నది ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ గర్భంతో ఉన్నప్పుడు మానేయడమే మంచిది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గర్భిణులకు అవసరమే.. కానీ.,ఇందులో ఉండే కెఫీన్ వల్ల కడుపులోని శిశువుకు నష్టం కలుగుతుంది. గ్రీన్ టీలో కెఫిన్ తక్కువ మొత్తంలో ఉన్నప్పటికీ అధికంగా తాగితే మాత్రం ఇబ్బందులు కలుగుతాయి. పిండంలోని డీఎన్ఏకు నష్టం కలిగించి, ఎదుగుదలకు అడ్డంగా మారుతుంది.

గ్రీన్ టీలోని కెఫీన్ వల్ల శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు కూడా వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల శరీరంలో ద్రవాలు బయటికిపోతాయి. అతిగా తీసుకుంటే గర్భధారణ సమయంలో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

రోజుకు రెండు కప్పులు తాగితే..

గర్భిణులు అధిక మొత్తంలో కాకుండా రోజుకు ఒకటి , రెండు కప్పుల గ్రీన్ టీకి పరిమితం కావటం వల్ల కొన్ని ప్రయోజనాలు పొందవచ్చు. అయితే రోజు మొత్తంలో తగినంత నీరు తాగతూ ఉండాలి. ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా వచ్చే సమస్యల్లో హెచ్చుతగ్గుల రక్తపోటు ఒకటి. గ్రీన్ టీ అనేది యాంటీఆక్సిడెంట్స్ (పాలీఫెనాల్స్) యొక్క మూలం, ఇది సెల్ డ్యామేజ్ నివారిస్తుంది. అందుకే గర్భధారణ సమయంలో గ్రీన్ టీ తీసుకోవడం వల్ల రక్తం పోటు అదుపులో ఉంటుంది.గ్రీన్ టీ గర్భధారణ సమయంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. గ్రీన్ టీ శరీరంలో ఉండే టి-కణాలను ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది, ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.

గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలోని జీవక్రియ పెరుగుతుంది, ఇది గర్భధారణ సమయంలో మూడ్ స్వింగ్‌లను ఎదుర్కోవడానికి పనిచేస్తుంది. గ్రీన్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇది ఎరుపు, దురద లేదా వాపు వంటి చర్మ సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది.
సో.. అలా కొన్ని లాభాలు ఉన్నాయి.. లిమిట్‌ ఎక్కువైతే నష్టాలు ఉన్నాయి.. కాబట్టి మితంగా తాగడంలో తప్పులేదు.!

Read more RELATED
Recommended to you

Latest news