రాత్రిపూట ఎట్టిపరిస్థితుల్లో వీటిని తీసుకోవద్దు..!

-

మనం తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం మీదే ఆధారపడి ఉంది. అయితే ఆహారం విషయంలో చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు. ఆహారం తీసుకునేటప్పుడు ఎటువంటి తప్పులు చేయకుండా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది..? రాత్రిపూట ఈ ఆహార పదార్థాలని అసలు తినకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు మరి ఎటువంటి ఆహార పదార్థాలని రాత్రి తినకూడదు అనేది ఇప్పుడు చూద్దాం.

మంచి నిద్ర అవసరం:

రాత్రి పూట మంచి నిద్రని పొందాలి కాబట్టి ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి అలానే రాత్రి పూట తీసుకునే కొన్ని ఆహార పదార్థాల వలన నిద్ర పాడవుతుంది.

కీరదోస:

రాత్రి పూట కీరా ని అసలు తీసుకోకూడదు కీర దోసను తీసుకోవడం వలన కడుపు ఉబ్బరం వస్తుంది పైగా ఎక్కువ నీరు ఉంటుంది కాబట్టి రాత్రి పదేపదే లేవాల్సి వస్తుంది.

కాలీఫ్లవర్:

దీన్ని కూడా రాత్రి తీసుకోవద్దు ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణం అవడానికి సమయం పడుతుంది నిద్ర పట్టదు.

పెరుగు:

రాత్రి పూట పెరుగును తింటే కఫం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రాత్రి పెరుగు తినకండి.

బ్రోకలీ:

రాత్రిపూట బ్రోకలీ తీసుకోవడం వలన కూడా ఇబ్బందులు వస్తాయి ఇందులో ఉండే ఫైబర్ జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎసిడిటీ సమస్య కూడా రావచ్చు.

రాజ్మా:

రాత్రిపూట రాజ్మాని తింటే గ్యాస్టిక్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తినకండి.

వంకాయ:

వంకాయ శరీరాన్ని చురుకుగా ఉంచడానికి హెల్ప్ అవుతుంది కనుక రాత్రి తింటే నిద్ర పట్టదు అలానే స్పైసి ఫుడ్ ని కూడా రాత్రిపూట తీసుకోకండి ఇది కూడా సమస్యను కలిగిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news