ప్రెగ్నెస్సీ సమయంలో మష్రూమ్స్ తింటున్నారా? పుట్టగొడుగుల వాడకం మంచిది కాదట..! 

-

ఒకప్పుడు పుట్టగొడుగులు పెద్దగా తినేవాళ్లు కాదు..ఊర్లల్లో వాళ్లు కూడా..వానపడినప్పుడు పొలాల్లో దొరికితే అప్పుడు తెచ్చుకుని మాత్రమే వండుకునేవారు..అంతేకానీ..కొనుక్కోని తినగలిగే ఐటమ్ గా పుట్టగొడుగులను అనుకునేవాళ్లు కాదు.. కానీ ఈ మధ్యకాలంలో ప్రజలకు అన్నింటిపై అవగాహన పెరుగుతుంది. మష్రూమ్ తినటం వల్ల కలిగే ఆరోగ్య లాభాలను తెలుసుకున్నారు. అందుకే..ఫుడ్ స్టోర్స్ లోనూ ఇవి దొరుకుతున్నాయి..కాస్త ఖరీదైన తెచ్చుకుని తింటున్నారు. మష్రూమ్స్ కర్రీ చాలా రుచిగా కూడా ఉండటంతో..వాటిపై ఇష్టం పెరిగి కొంతమంది వారానికి రెండుమూడుసార్లు కూడా తింటున్నారు. పుట్టగొడుగులో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, దాని వినియోగం ఆరోగ్య పరంగా ప్రయోజనకరంగా పరిగణించడంలేదు. పుట్టగొడుగులను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది.
‘విటమిన్ డి’ కి మష్రూమ్స్ లో అధికంగా ఉంటుంది. అయితే మార్కెట్లో చాలా రకాల పుట్టగొడుగులు లభిస్తున్నాయి. వాటిలో దాదాపు 15 హానికరమైనవి ఉన్నాయని మీకు తెలుసా? మరోవైపు, మీరు తప్పుడు రకం ఎంచుకోవడంతోపాటు అవసరమైన దానికంటే ఎక్కువగా పుట్టగొడుగులను తింటే మాత్రం అనేక దుష్ప్రభావాలను ఎదుర్కొవాల్సి ఉంటుంది.
గర్భధారణ సమయంలో- ప్రెగ్నెంట్ సమయంలో మాత్రం స్త్రీలు పుట్టగొడుగులను తినకూడదు. ఇవి పిల్లల లేదా తల్లి ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాలు లేనప్పటికీ, మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం పుట్టగొడుగులకు దూరంగా ఉండటమే మంచిది.
కడుపు నొప్పి – చాలా మంది ప్రజలు పుట్టగొడుగులను తిన్న తర్వాత అతిసారం, కడుపు నొప్పి, వాంతులు, వికారం వంటి జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారని పరిశోధనలో తేలింది.
స్కిన్ అలెర్జీలు – పుట్టగొడుగులు మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. కానీ, కొందరు వ్యక్తులు వాటిని తీసుకోవడం ద్వారా చర్మంపై దద్దుర్లు, అలెర్జీలు వస్తున్నాయట.
నీరసం – పుట్టగొడుగులను తిన్న తర్వాత చాలా మంది అలసిపోతుంటారు. అలాగే కొంచెం అసౌకర్యంగా కూడా అనిపించవచ్చు. ఒంట్లో శక్తి స్థాయిలు కూడా తగ్గినట్లు ఉంటుంది.
పుట్టగొడుగులు తినటం ఆరోగ్యానికి మంచిదే..కానీ ఏ రకమైన మష్రూమ్స్ మంచివి అనేది ముందు తెలుసుకుని ఉండాలి. ఈరోజుల్లో ప్రతీది నకిలీ వచ్చేస్తుంది. హానికరమైన వాటితో తినేపదార్థాలు చేస్తున్నారు. పుట్టగొడుగులో ఏ రకం మంచిది ఓసారి వైద్యులను సంప్రదించి ఆపై అప్పుడప్పుడు వాడుకుంటూ ఉంటే..ఎలాంటి హాని లేకుండా ముష్రూమ్స్ వల్ల వచ్చే లాభాలను పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news