కొంతమంది విపరీతంగా తిన్నా బరువు పెరగరు. వాళ్లను చూసి లావుగా ఉండే వాళ్లు కాస్త జలస్ గా ఫీల్ అవుతారు కూడా.. బిర్యానీ అంతా లేపేస్తాడు కానీ..ఎప్పుడూ సన్నగానే ఉంటాడు.. మనం సగం తిన్నా..లావు అయిపోతున్నాం అనే బాధ ఉంటుంది. ఇలా ఏం తిన్నా, ఎంత తిన్నా లావు అవకపోవడం వారు అదృష్టంగా భావిస్తారేమో కానీ..అది భవిష్యత్తులో అంతమంచిది కాదు. వయసు పెరిగే కొద్ది ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఏదో లోపం ఉండబట్టే బలహీనంగా ఉంటున్నారు. అది జింక్ లోపం కూడా అయి ఉండొచ్చు. ఎవరి శరీరంలో అయితే జింక్ లోపం ఏర్పడుతుందో.. వారు బరువు తగ్గిపోతారు, ఎంత తిన్నా అవి బాడీకీ పట్టవు..అందుకే బరువు పెరగరు. బాడీలో జింక్ 300రకాల పనులు చేస్తుంది. మరి అలాంటి జింక్ మీ బాడీలో లేకపోతే.. ఆ పనులన్నీ మరే ఏ విటమిన్ చేయదండి.. దానివల్ల లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయి.
జింక్ లోపం వల్ల ఆకలి తగ్గుతుంది. ఒత్తిడికి గురవుతారు. అవసరమైన మినరల్స్ లేకపోవడం వల్ల కూడా జుట్టు రాలే సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు చూసే ఉంటారు. అసలు బాగా సన్నగా ఉండే వారిలో కొందరికి జుట్టు కూడా పెద్దగా ఉండదు. సన్నగా పాలిపోయి.. రాలిపోయిన జట్టుతో అన్నం తింటున్నారా, గాలిపీల్చుకుని బతుకుతున్నారా అన్నట్లు ఉంటారు. అలాంటి వారు ఆరోగ్యంగా లేనట్లే. అయితే సన్నగా ఉన్న అందరిలో ఇదే లోపం ఉంటుందని కాదు.. కానీ ఉండే అవకాశం మాత్రం ఉంది. కాబట్టి శరీరానికి అవసరమైన జింక్ లోపాన్ని ఏ ఆహారం ద్వారా తీర్చవచ్చో చూద్దామా.!.
మాంసంతో : జింక్ లోపం అల్జీమర్స్ వంటి వ్యాధులకు కూడా దారి తీస్తుంది. మాంసాహారం తీసుకోవడం ద్వారా జింక్ లోపాన్ని సరి చేయవచ్చు. వంద గ్రాముల మాంసంలో 4.8 మిల్లీగ్రాముల జింక్ ఉంటుంది… ఇతర విటమిన్లు కూడా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మీరు బరువు పెరగకపోతే.. మాంసాహారం తినే అలవాటు ఉన్నట్లయితే..మీ ఆహారంలో మాంసాన్ని చేర్చేసుకోండి..
పుట్టగొడుగులు: శరీరంలోని జింక్ లోపాన్ని తీర్చడంలో పుట్టగొడుగులు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. పుట్టగొడుగులలో ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్ , ప్రోటీన్లు కూడా ఉన్నాయి. ఎముకల పుష్టికి పుట్టగొడుగులు నెంబర్ వన్.
నువ్వులు : శరీరంలో జింక్ లోపాన్ని తీర్చడానికి నువ్వులు ఉత్తమైన ఆహారం. నువ్వులలో ప్రొటీన్లు, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఫోలిక్ యాసిడ్ , బి కాంప్లెక్స్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. నువ్వులతో చేసిన లడ్డూలు తినొచ్చు, కూరల్లో నువ్వుల పొడిని వాడొచ్చు. ఇలా డైలీ నువ్వులను మీరు తినే ఆహారంలో భాగం చేసుకుంటే.. జింక్ లోపమే కాదు.. జుట్టుకు, ఎముకల ఆరోగ్యానికి కూడా మంచిది.
గుడ్లు: జింక్ లోపాన్ని తీర్చడానికి, గుడ్లు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. డైలీ ఉడకపెట్టినా లేదా.. ఒక ఆమ్లెట్ వేసుకుని తినండి. గుడ్డులోని పచ్చసొనలో ఉండే జింక్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు శరీరంలోని బలహీనతను దూరం చేస్తుంది.
గమ్మడిగింజలు, జనపనార విత్తనాలు: ఈ రెండు విత్తనాల్లో జింక్ శాతం అధికంగా ఉంటుంది. వీటిని డైలీ నానపెట్టుకుని తింటే.. బాడీకి పుష్కలంగా కావాల్సిన జింక్ అందుతుంది. వీటితోపాటు ఖర్జూరం కలిపి లడ్డూలు చేసుకుని కూడా తినొచ్చు.
సన్నగా ఉన్నాం కదా అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారామో.. అసలు సమస్య ఏంటి అనేది తెలుసుకోవాలి కదా.. వంశపారపర్యంగా అయితే ఓకే..సమస్య ఉండకపోవచ్చు. కానీ సడన్గా బరువు తగ్గడం, లేదంటే.. ఇంట్లో ఎవరూ అంత బలహీనంగా లేకున్నా.. మీరు మాత్రం బక్కచిక్కి పోతుంటే ఆలోచించాల్సిందే..!
-Triveni Buskarwothu