బీట్‌రూట్‌ను డైలీ తింటే..కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయా..?

-

బీట్‌రూట్‌ వల్ల అందం, ఆరోగ్యం రెండూ మెరుగుపడతాయి.. రక్తం తక్కువ ఉంటే..బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగమని వైద్యులు అంటుంటారు.. డైలీ బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగడం వల్ల స్కిన్‌ కూడా మంచి గ్లోయింగ్‌ వస్తుంది. ఇందులో విటమిన్‌ బి, విటమిన్‌ సి, ఫాస్పరస్‌, కాల్షియం, ప్రొటీన్‌, ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి వీటిని తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. అయితే బీట్‌రూట్‌ అందరికీ మంచిది కాదు..దీనికి అధికంగా తినడం వల్ల.. చాలా రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.. అవేంటంటే..
beetroot

మధుమేహం ఉన్నవారికి అస్సలు వద్దు..

మధుమేహం ఉన్నవారు బీట్‌రూట్‌ జోలికి పోవద్దు..బీట్‌రూట్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, మధుమేహం వ్యాధితో బాధపడుతున్నవారు వీటిని తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అల్ప రక్తపోటు:

బీట్‌రూట్ తినడం రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నవారికి ఇంకా హాని కలిగించవచ్చు. ఇందులో నైట్రేట్ అధిక పరిమాణంలో ఉంటుంది. కాబట్టి దీని కారణంగా రక్తపోటు తీవ్ర వ్యాధిగా మారొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే తక్కువ రక్తపోటు ఉన్న రోగులు బీట్‌రూట్ తినకూడదు.

కిడ్నీల్లో రాళ్ల సమస్యలు:

బీట్‌రూట్ కిడ్నీల్లో రాళ్లను పెంచుతుందట.. అందుకే కిడ్నీ స్టోన్ సమస్యలతో బాధపడేవారు దీనిని తినకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొందరిలో మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను పెంచుతుందట.. మీరు బీట్‌రూట్‌ డైలీ తింటుంటే.. కిడ్నీ ఆరోగ్యం చూసుకోండి.

కాలేయా సమస్యలు

బీట్‌రూట్ జీర్ణక్రియ రేటును పెంచడానికి చాలా ప్రభావవంతంగా సహాయపడుతుంది. అయితే దీనిని అతిగా తినడం వల్ల కాలేయం దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు.. కాబట్టి కాలేయా సమస్యలతో బాధపడేవారు దీనిని తినకపోవడం చాలా మంచిది.
అతిగా తిన్నప్పుడే ఈ సమస్యలు వస్తాయి.. కాబట్టి.. బీట్‌రూట్‌ను తినండి.. కానీ ఉద్యమం లెక్క డైలీ వద్దు అంటున్నారు నిపుణులు.. ఇక మధుమేహం ఉన్నవాళ్లు అయితే పక్కన పెట్టడమే ఉత్తమం..

Read more RELATED
Recommended to you

Latest news