రాజేంద్రనగర్‌లో దారుణం.. పదో తరగతి విద్యార్థి దుర్మరణం..

పెద్దలు చెప్పిన మాటను పక్కన పెట్టి కొన్ని కొన్ని సార్లు తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు చేసే పనులు వారి ప్రాణాలను బలిగొంటాయి. అలాంటి ఘటనే ఇది.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న మహ్మద్‌ అనే విద్యార్థి.. ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా ఇంట్లోని బైక్ తీసుకొని స్నేహితులతో కలిసి సరదాగా బయటకు వచ్చాడు.. అయితే పిల్లర్ నెంబర్ 194 వద్దకు రాగానే మోటర్ సైకిల్ అదుపు తప్పి మహ్మద్ కింద పడ్డాడు.

What to do when you meet with a car accident? | Fast Track | Onmanorama

దీంతో.. మహ్మద్‌ తలకు తీవ్రమైన గాయం కావడంతో తల పగిలి పోవడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మహ్మద్‌ ప్రాణాలు విడిచాడు. అయితే.. విషయం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన మహ్మద్‌ వివరాలు తెలుసుకున్న పోలీసులు.. వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మహ్మద్‌ మరణవార్త విని అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.