పొత్తులో ఎత్తులు: నష్టపోయేది ఎవరు?

-

ఏపీ రాజకీయాల్లో పొత్తుల అంశంపై ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి..టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీల మధ్య పొత్తుల విషయం రచ్చ నడుస్తోంది. కలిసికట్టుగా పనిచేసి అధికార వైసీపీకి చెక్ పెట్టాల్సిన పార్టీలు….వారిలో వారే గొడవపడి రచ్చ లేపుతున్నారు. అసలు ఎవరికి వారే తోపులు అని అనుకుంటున్నారు. తాము సింగిల్ గా గెలిచేస్తామంటే…తాము గెలిచేస్తామని జబ్బలు చరుచుకుంటున్నారు. ఇక ఈ పొత్తుల రచ్చ వల్ల ఇంకా వైసీపీకే అడ్వాంటేజ్ పెంచేలా ఉన్నారు.

ప్రస్తుతం అధికార వైసీపీ బలంగానే ఉందని చెప్పొచ్చు…కాకపోతే 2019 ఎన్నికల్లో ఉన్న బలం ఇప్పుడు లేదు…ఆ పార్టీ బలం ఇప్పుడు తగ్గుతూ వస్తుంది…అదే సమయంలో టీడీపీ బలం పెరుగుతుంది…అలా అని వైసీపీకి చెక్ పెట్టేంత బలం టీడీపీకి రాలేదు…అలాగే జనసేన బలం కూడా పెరుగుతుంది…కానీ ఆ పార్టీ సింగిల్ గా పోటీ చేస్తే…ఓ ఐదారు సీట్లు గెలుచుకునే బలం మాత్రమే ఉంది. ఇక బీజేపీకి రాష్ట్రంలో బలం పెరగలేదు…కేవలం కేంద్రంలో అధికారంలో ఉండటమే ఆ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్.

అయితే జగన్ కు చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా చంద్రబాబు-పవన్ కలవాల్సిన పరిస్తితి…అదే సమయంలో వీరితో బీజేపీ కలవడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు…కాకపోతే కేంద్రం సపోర్ట్ ఉండటం ప్లస్ అవుతుంది. అంటే ఈ మూడు పార్టీలు కలిసిన…లేదా టీడీపీ-జనసేన కలిసినా…వైసీపీకి ఇబ్బంది..అలా కాకుండా ఎవరికి వారే సింగిల్ గా బరిలో దిగితే వైసీపీకే అడ్వాంటేజ్.ఆ విషయం క్లియర్ గా అర్ధమవుతుంది.

కానీ ఎవరికి వారు తమకే ఎక్కువ బలం ఉందని ఊహించుకుంటున్నారు…తాము సింగిల్ గా పోటీ చేసి అదిరిపోయే విజయాన్ని అందుకుంటామని టీడీపీ భావిస్తుండగా, తమ నాయకుడు పవన్ సీఎం అని జనసేన భావిస్తుంది…అటు బీజేపీ కూడా తనని తాను ఎక్కువ ఊహించుకుంటుంది.  ఇలా మొత్తానికి ఎవరికి వారు ఎక్కువ ఊహించుకుని పొత్తుకు దూరమైతే…ప్రధానంగా నష్టపోయేది టీడీపీ-జనసేన పార్టీలే..లాభపడేది మాత్రం వైసీపీనే.

Read more RELATED
Recommended to you

Latest news