ఈ సారి కచ్చితంగా చంద్రబాబే సీఎం అని అచ్చెన్న ట్వీట్ చేశారు. గత మూడేళ్లలో ఏపీలో ఎన్నో అరాచకాలు జరిగాయని.. దళితులపై దాడులు, ఆడపిల్లలపై అత్యాచారాలు, కల్తీ మద్యం, ప్రతిపక్షాల నాయకులు కార్యకర్తలపై దాడులు చేశారని ట్వీట్ లో పేర్కొన్నారు. భూ కబ్జాలు, మైనింగ్ మాఫియా, శ్యాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మట్టి మాఫియా, కోర్టు ధిక్కారాలు, చెత్త రోడ్లు, పూర్తిగా నిలిచిపోయాయని తెలిపారు అచ్చెన్నాయుడు.
అభివృద్ధి, లక్షల కోట్లలో ప్రభుత్వం విచ్చలవిడిగా చేస్తున్న అప్పులు, అధికార పార్టీ నేతల ఆగడాలు చూసి చూసి, సామాన్య ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారని వెల్లడించారు. ఈ సారి ఖచ్చితంగా చంద్రబాబే ఏపీకి సీఎం కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారని.. కానీ కేవలం మూడంటే మూడేళ్ళలో సొంత పార్టీ కార్యకర్తలు, అభిమానులకు కూడా జగన్ రెడ్డి నైజం, అతని అసమర్థ పాలన గురించి అర్థమైపోయిందని పేర్కొన్నారు. బహిరంగంగా తమ అసంతృప్తి వెళ్లగక్కడమే కాదు, ఈసారి తమ పార్టీ గెలిచే పరిస్థితి లేనే లేదని వారే స్వయంగా చెబుతున్నారన్నారు అచ్చెన్నాయుడు.
విచ్చలవిడిగా చేస్తున్న అప్పులు, అధికార పార్టీ నేతల ఆగడాలు చూసి చూసి, సామాన్య ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ఏపీకి సీఎం కావాలి అని.
కానీ కేవలం మూడంటే మూడేళ్ళలో సొంత పార్టీ కార్యకర్తలు, అభిమానులకు కూడా జగన్ రెడ్డి నైజం, అతని అసమర్థ
(2/3) pic.twitter.com/n4BiaIyK5m— Kinjarapu Atchannaidu (@katchannaidu) August 2, 2022