చంద్రబాబుపై మరోసారి మంత్రి పెద్దిరెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు

-

చంద్రబాబు ఆరోపణలను ఖండించిన మంత్రి పెద్దిరెడ్డి… ఆయనపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మైనింగ్ మాఫియాకు పాల్పడింది ఎవరో ప్రజలకు తెలుసు అని.. రిషికొండలో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. కుప్పంలో రౌడీయిజం చేసేది టిడిపి నాయకులేనని.. కుప్పంలో జరుగుతున్న మాఫియాకు నాకు ఎలాంటి సంబంధం లేదని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు మంత్రి పెద్దిరెడ్డి.

ఇసుక అక్రమ రవాణ చంద్రబాబు హయంలో జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి పెద్దిరెడ్డి. 75 ప్రాంతాలలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చంద్రబాబు చౌకబారు విమర్శలు చేస్తూన్నారన్నారు. 14 సంవత్సరాల సియంగా వున్న చంద్రబాబు హయంలో మైనింగ్ కి సంభందించి కేంద్రం ఎప్పుడున్నా అవార్డులు ఇచ్చిందా? అని నిలదీశారు. మూడు సంవత్సరాలలో మా ప్రభుత్వానికి రోండు సార్లు అవార్డులు వచ్చాయని.. కుప్పంని దృష్టిలో వుంచుకోని చంద్రబాబు ఆరోపణలు చేస్తూన్నారని ఆగ్రహించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news