ఏపీలో గణనీయంగా తగ్గిన కోవిడ్ కేసులు… 100 లోపే కొత్త కేసులు నమోదు

-

ఆంధ్ర ప్రదేశ్లో కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గత 24 గంటల్లో వందలోపు కేసులు మాత్రమే నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం థర్డ్ వేవ్ పూర్తిగా అంతమైంది. ఇటీవల కాలంలో కోవిడ్ తీవ్రత తగ్గడంతో రోజూ వారీ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. 

తాజాగా గడిచిన 24 గంటల్లో 14788 కరోనా నిర్థారణ పరీక్షలు చేస్తే  కేవలం 86 మందికే కరోనా పాజిటివ్ గా తేలింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. 288 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,31,54,437 కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా ప్రారంభం అయిప్పటి నుంచి రాష్ట్రంలో 23,18,262 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇప్పటి వరకు 23,02,192 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా బారిన పడి ఇప్పటి వరకు 14729 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1341 యాక్టిివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో గుంటూర్ లో అత్యధికంగా 17 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రకాశం, విశాఖ పట్నం, వెస్ట్ గోదావరి జిల్లాల్లోనే పది కన్నా ఎక్కువ కరోనా కేసులు నమోదు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news