నెక్స్ట్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌తో కలిసి పోటీ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు తెగ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే…పవన్‌ని కలుపుకుంటేనే జగన్‌కు చెక్ పెట్టగలమని బాబుకు అర్ధమైంది..అందుకే జనసేనతో పొత్తు పెట్టుకోవాలని బాబు ప్రయత్నిస్తూనే ఉన్నారు…ఇటీవల కుప్పం పర్యటనలో పొత్తు గురించి తన మనసులో మాట బయటపెట్టిన విషయం తెలిసిందే…వన్ సైడ్ లవ్ వల్ల ఉపయోగం లేదని చెప్పారు…అంటే బాబు పొత్తు కోసం ట్రై చేస్తున్నారు గాని..పవన్ నుంచి సహకారం లేదని అర్ధమైంది.
అదే సమయంలో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలంటే పవన్‌కు సీఎం సీటు ఇవ్వాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు…లేదా 75 సీట్లు ఇవ్వాలని కోరారు. అసలు జనసేనకు ఏపీలో 10 సీట్లు గెలిచే కెపాసిటీ కూడా లేదని, అలాంటప్పుడు పవన్‌కు సీఎం సీటు ఇవ్వడం వింతగా ఉందని తెలుగు తమ్ముళ్ళు ఫైర్ అయిన విషయం తెలిసిందే..అసలు పొత్తు అనవసరమని, నెక్స్ట్ ఒంటరిగానే పోటీ చేసి సత్తా చాటాలని తమ్ముళ్ళు, చంద్రబాబుకు సూచించారు.
అయితే బాబు దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది…కాకపోతే పొత్తు ఉంటే ఓకే..ఒకవేళ పొత్తు లేకపోతే ఒంటరిగా పోటీ చేసి ఎలా గెలవాలనే ప్లాన్ బాబు ఆలోచిస్తున్నారట. ఎలా లేదు అనుకున్న జనసేన వల్ల కాస్త టీడీపీ డ్యామేజ్ జరుగుతుందనే సంగతి తెలిసిందే…గత ఎన్నికల్లో దాదాపు 30-35 సీట్లలో జనసేన ఓట్లు చీల్చి టీడీపీకి డ్యామేజ్ చేసింది. ఈ సారి కూడా ఓ 25 సీట్లలో నష్టం జరగొచ్చని తెలుస్తోంది. ఇక ఆ స్థానాల్లో టీడీపీ డ్యామేజ్ కంట్రోల్ చేయాలని బాబు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.
జనసేన ప్రభావం ఉన్న స్థానాల్లో టీడీపీ నేతలు మరింత బలం పెంచుకోవాలని, వైసీపీ ఎమ్మెల్యేలు, జనసేన నేతల కంటే ముందు ఉండాలని, అప్పుడే విజయం సాధించడం కుదురుతుందని బాబు, టీడీపీ నేతలకు సూచిస్తున్నారట. కనీసం ఓ 10 సీట్లనైనా డ్యామేజ్ కంట్రోల్ చేయాలని అనుకుంటున్నారు..ఒకవేళ పొత్తు ఉంటే ఇబ్బంది లేదని, లేకపోతే మాత్రం ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటాలని నేతలకు సూచిస్తున్నారట.