ఖబడ్దార్ కేసీఆర్‌.. యుద్దానికి సిద్ధం.. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది : బండి సంజయ్‌

-

తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర పేరిట పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే నాలుగు విడతలుగా ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టారు. ఇప్పుడు ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బండి సంజయ్‌ మాట్లాడుతూ… ఖబడ్దార్ కెసిఆర్… యుద్దానికి సిద్దం…. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.. నీ కుట్రలు కుతంత్రాలు ఎదుర్కొంటామన్నారు. అంతేకాకుండా.. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన గోలకొండ కిల్లా పై కాషాయ జండా ఎగుర వేస్తం. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అంటే సీఎం కుటుంబానికి కమిషన్ ఇవ్వాలి , భాగ స్వామ్యం ఇవ్వాలి. కెసిఆర్ ఏ రోజు రాష్ట్రానికి లాభం జరగాలి అని ఆలోచించడు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదు ఈ ప్రభుత్వం. కేంద్ర నిధులు దారి మల్లిస్తున్నాడు. పది లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు సాగుతుంది మోడీ ప్రభుత్వం. కేంద్రం ఉద్యోగాలు ఇస్తుంటే… ఈ ప్రభుత్వం ఉద్యోగాలు తొలగిస్తుంది. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు… ప్రమోషన్ లు ఇవ్వకుండా రివర్సన్ లు ఇస్తున్నాడు. కమ్యూనిస్ట్ లు కార్మికుల కోసం అంటున్నారు… సీఎం దగ్గర మొకరిల్లారు. కాంగ్రెస్ , కమ్యూనిస్ట్ లతో కలిసి పోటీ చేద్దామని కెసిఆర్ వాళ్ల కార్యకర్తలకు చెపుతున్నారు.
కెసిఆర్ ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా బిజెపి నీ అప్రదిష్ట పాలు చేస్తున్నారు. తెలంగాణ డబల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే.

- Advertisement -

Telangana BJP chief Bandi Sanjay Kumar held over protest against arrest of  workers - India Today

ప్రజల కు ఉపయోగ పడే ఏ సంక్షేమ పథకాన్ని బిజెపి రద్దు చేయదు. తెలంగాణ లోని పేదలందరికీ ఉచిత విద్యా వైద్యం ఇస్తామని ప్రకటించాము, పేదలందరికీ పక్క గృహాలు నిర్మించి ఇస్తామని చెప్పాము అధికారం లోకి వచ్చాక నెరవేరుస్తాము. కెసిఆర్ మరో సారి సెంటిమెంట్ ను రగిల్చి అధికారం లోకి రావడానికి చూస్తున్నారు. సీఎం కెసిఆర్ తెలుసుకోవాలి… ఈ దేశం కోసం పని చేసే వారు సంఘ్ ప్రచారక్ లు…అలాంటి వ్యక్తులను సీఎం అవమానిస్తున్నారు. సీఎం నీ లాంటి మూర్ఖుల నుండి రాష్ట్రాన్ని రక్షించడానికి వాళ్ళు పని చేస్తున్నారు.. బి ఎల్ సంతోష్ జి ఏమి చేశారు. ఆయనకు ఫార్మ్ హౌస్ లు లేవు, బ్యాంక్ అకౌంట్ లు లేవు. అయన ఎమ్మేల్యే ,ఎంపి కావాలని అనుకోలేదు. అయన ఈ దేశం కోసం పని చేసే వ్యక్తి… అయన జోలికి వస్తె బిజెపి సహించే ప్రసక్తే లేదు. నీ కుటుంబం కోసం, నీ రాజకీయ లబ్ది కోసం, కొడుకు కూతురు స్కాం లో నుండి బయట పడేందుకు ఆయనను అవమానిస్తున్నారు.’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...