తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావడం ఖాయం : బండి సంజయ్‌

-

నిన్న గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయ దుందుభి మ్రోగించిన సంగతి తెలిసిందే. అయితే.. తెలంగాణలో ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్న రాష్ట్ర బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గుజరాత్ ఫలితాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని అన్నారు. గుజరాత్ లో జరిగిన అభివృద్ధి ఏముందని కేసీఆర్ పదేపదే ప్రశ్నించారని… ఇప్పుడు గుజరాత్ ఫలితాలపై ప్రశ్నించాలని అన్నారు బండి సంజయ్‌. అభివృద్ధి చేయకపోతే ప్రజలు ఇంతటి ఘన విజయాన్ని ఎలా అందిస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం అవినీతి పాలన కొనసాగుతోందని… రాష్ట్రంలో అవినీతి రహిత పాలన కేవలం బీజేపీతోనే సాధ్యమని అన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావడం ఖాయమని చెప్పారు. కేసీఆర్ పదవి నుంచి తప్పుకుని విశ్రాంతి తీసుకునే సమయం ఆసన్నమయిందని అన్నారు.

డ్రగ్స్ బానిస.. నమూనాలిస్తే నిరూపిస్తా.. కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్ | Bandi  Sanjay challenged KTR to give his hair and blood samples to prove as KTR is  drug addict - Telugu Oneindia

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మొత్తం కేంద్ర నిధులతోనే అనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయిందని చెప్పారు బండి సంజయ్‌. రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల అవినీతి, అక్రమాలను బయటకు తీసేందుకు కేంద్రం మీటర్లు పెడుతుందని అన్నారు. ఏపీ, తెలంగాణ మళ్లీ కలిసిపోవాలనేదే తమ విధానమని వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. పక్క రాష్ట్రంతో వైరం ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ… మళ్లీ సెంటిమెంట్ ను లేవనెత్తేందుకు వైసీపీతో కలిసి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు బండి సంజయ్‌. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కూతురు కవిత ఉన్నారని… దీన్నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని అన్నారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Latest news