నేనే రాజు.. నేనే మంత్రి అన్న రీతిలో సాగుతోంది కేసీఆర్ వ్యవహారం: బట్టి విక్రమార్క

-

సీఎల్పీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. నేనే రాజు.. నేేనే మంత్రి అన్న రీతిలో సాగుతోంది సీఎం కేసీఆర్ వ్యవహారం అంటూ… సీఎల్పీ నేత బట్టి విక్రమార్క విమర్శించారు. గవర్నర్ ని బడ్జెట్ సమావేశాలకు రానీయకుండా చేశారని దుయ్యబట్టారు. గవర్నర్ ప్రసంగం లేకపోతే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎవరిస్తారని ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ సంక్షోభమే అని ఆయన అన్నారు. బంగారు తెలంగాణ అయిపోయింది.. ఇక బంగారు భారతదేశం చేయాలని.. ఇది ఒకటే మిగిలిపోయిందని రాష్ట్రాన్ని గాలికి వదిలేసి.. చెన్నై, ముంబై, ఢిల్లీ, రాంచీ అంటూ సీఎం కేసీఆర్ తిరుగుతున్నారని బట్టి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే.. తెలంగాణ సంపద 4 కోట్ల మందికి పంచబడుతుందని.. విద్యార్ధులకు ఉద్యోగాలు వస్తాయని.. సోనియా గాంధీ ఇస్తే.. ప్రస్తుతం అలాంటి ఆకాంక్షలు నెరవేరడం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర పరిస్థితులు ఒకటిగా ఉంటే.. దేశాన్ని భ్రమ పట్టించేలా కేసీఆర్ చర్యలు ఉన్నాయని ఆయన అన్నారు. అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి భారత రాజ్యాంగాన్ని మార్చేసి కొత్తది రాయాలని అనుకున్నారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news