రాజకీయంగా పవన్ కల్యాణ్ దూకుడుగానే ముందుకెళుతున్నారు..అధికార వైసీపీపై తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్నారు..ఓ వైపు సినిమాలు చేస్తూనే…మరోవైపు ప్రజలకు అండగా ఉంటూ, వారి సమస్యలపై గళం విప్పుతున్నారు. అలాగే వైసీపీని గద్దె దించడానికి టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి కూడా రెడీ అవుతున్నారు. అయితే ఇంత చేస్తున్నా సరే…జనసేన బలం ఏ మాత్రం పెరగడం లేదు. 2019 ఎన్నికల్లో ఒక సీటు గెలుచుకుని, 6 శాతం ఓట్లు తెచ్చుకుంది.
అయితే అప్పటికి….ఇప్పటికి పెద్ద తేడా కనిపించడం లేదు…మహా అయితే రెండు శాతం ఓట్లు పెరిగాయి…అలాగే నాలుగైదు సీట్లు గెలుచుకునే బలం వచ్చింది. అంతే తప్ప రాష్ట్ర స్థాయిలో సత్తా చాటే బలం జనసేనకు రాలేదు. ఇంకా చెప్పాలంటే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న పవన్…జనసేనని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు కనిపించడం లేదు. పైగా జనసేన బలపడుతుందంటే వలసలు పెరగాలి. కానీ జనసేనలోకి వలసలు జరగడం లేదు.
వైసీపీ, టీడీపీలోకి మాత్రం వలసలు ఉన్నాయి. ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులని తీసుకోకపోతే జనసేన బలం పెరగడం కష్టం. కింది స్థాయి కార్యకర్త నాయకుడుగా ఎదిగే సరికి చాలా టైమ్ పడుతుంది. కాబట్టి వైసీపీ-టీడీపీల్లో ఉన్న బలమైన నాయకులని లాగాల్సి ఉంటుంది. అయితే ఇంకో ఏడాదిలో ఎన్నికల సందడి మొదలవుతుంది..అప్పుడు ఎక్కువ స్థాయిలో వలసలని ప్రోత్సహించాలి. అలాగే అప్పుడు జనసేనకు మంచి ఆఫర్లు వస్తాయి.
ఎందుకంటే వైసీపీ-టీడీపీల్లో టికెట్లు దక్కని వారిని లాగేసుకోవచ్చు. ఇప్పటికే కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కడం కష్టమని తెలుస్తోంది. ముఖ్యంగా కోస్తాలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలకు సీటు డౌటే…అలాంటి వారిపై ఫోకస్ చేసి…వారిని జనసేనలోకి లాగితే పార్టీ బలం పెరుగుతుంది. అదేవిధంగా టీడీపీలో కూడా కొందరు నాయకులకు సీట్లు కష్టమని తెలుస్తోంది…అలాంటి వారిని కూడా పార్టీలోకి తీసుకోవాలి…అప్పుడే జనసేన బలం పెరుగుతుంది…మరి ఇలాంటి బంపర్ ఆఫర్‌ని పవన్ యూజ్ చేసుకుంటారో లేదో.