Breaking : ఇక నుంచి ‘బీఆర్‌ఎస్‌’.. అమోదించిన కేంద్ర ఎన్నికల సంఘం

-

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును..” భారత్ రాష్ట్ర సమితి ” గా ఆమోదిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పార్టీ అధినేత సీఎం కెసిఆర్ అధికారికంగా లేఖ అందింది. ఈ నేపథ్యంలో .. రేపు అనగా డిసెంబర్ 9 శుక్రవారం మధ్యాహ్నం 1: 20 నిమిషాలకు దివ్య ముహూర్త సమయాన “భారత రాష్ట్ర సమితి” ఆవిర్భావం కార్యక్రమం నిర్వహించాలని, అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని, బిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో రేపు మధ్యాహ్నం1.20 నిమిషాలకు, తనకు అందిన అధికారిక లేఖకు రిప్లై గా సంతకం చేసి ఎన్నికల సంఘానికి అధికారికంగా పంపించడం జరుగుతుంది.

Hyderabad: Telangana Rashtra Samiti (TRS) renamed as Bharat Rashtra Samiti ( BRS) - Global Green News

అనంతరం సీఎం కేసిఆర్ బిఆర్ఎస్ జెండాను ఆవిష్కరిస్తారు. పతావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హాజరుకావాలని ముఖ్యమంత్రి కోరారు. వీరితోపాటు.. జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డిసిసిబి అధ్యక్షులు డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు అందరూ శుక్రవారం మధ్యాహ్నం లోపు తెలంగాణ భవనకు చేరుకోవాలని పార్టీ అధినేత సీఎం కేసిఆర్ తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news