ఏపీ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. పార్టీల పొత్తులపై రకరకాల చర్చలు వస్తున్నాయి. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారనే అంశంపై పెద్ద ఎత్తున ట్విస్ట్ లు నడుస్తున్నాయి. ఏదేమైనా ఏపీలో టిడిపి-జనసేనల పొత్తు ఖాయమని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. వీరితో బిజేపి కలుస్తుందా లేదా? అనేది క్లారిటీ లేదు. టిడిపితో పొత్తు వద్దని బిజేపి అంటుంది. కానీ జనసేన ప్రస్తుతం బిజేపితో పొత్తులో ఉంది. అలాగే టిడిపి పొత్తు పెట్టుకోవాలని చూస్తుంది.
అలాంటప్పుడు పవన్..బిజేపిని వదిలి టిడిపితో కలిసి రావాలి. బిజేపి ఏమో పరోక్షంగా వైసీపీకి సహకరిస్తుందనే విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో ఇటీవల బిఆర్‌ఎస్ పేరుతో కేసిఆర్ ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక కేసిఆర్ కూడా పరోక్షంగా వైసీపీకి లబ్ది చేకూర్చేలా..టిడిపి, జనసేన నేతలని టార్గెట్ చేసి బిఆర్‌ఎస్ లో చేర్చుకుంటున్నారని తెలుస్తోంది. అదే సమయంలో కేసిఆర్.పవన్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ తో పొత్తు పెట్టుకోవడానికి రాయబారం పంపుతున్నారని ఓ టిడిపి అనుకూల మీడియా కథనం వేసింది.
అలాగే వెయ్యి కోట్ల ఆఫర్ కూడా ఇచ్చారని చెబుతోంది. పవన్‌కు ఏపీ సిఎం పదవి ఆఫర్ కూడా ఇచ్చి..ఆయనతో కలిసి కొన్ని ఓట్లు చీల్చుకుని తమ బిఆర్‌ఎస్ పార్టీని జాతీయ పార్టీగా నిలుపుకునే ప్రయత్నాలు చేసి..పరోక్షంగా ఓట్లు చీల్చి జగన్ కు మేలు చేయాలనే కాన్సెప్ట్ తో కేసిఆర్ ఉన్నారని కథనం వచ్చింది.
మరి ఆ కథనంలో ఎంతవరకు నిజముందో క్లారిటీ లేదు. అదే సమయంలో తెలంగాణలో కేసిఆర్..కమ్యూనిస్టులతో పొత్తు తో ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇటు ఏపీలో కూడా కమ్యూనిస్టులని కలుపుకుని వెళ్లాలని చూస్తున్నారని తెలిసింది. అంటే పవన్, కమ్యూనిస్టులని టిడిపి వైపుకు వెళ్లనివ్వకుండా…తమ వైపుకు లాగి జగన్‌కు మేలు చేయాలని చూస్తున్నారని అంటున్నారు. మరి ఈ కథనం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.