ఫడ్నవిస్ కు సవాల్ విసిరిన కేసీఆర్

-

మహారాష్ట్రలోని కాందార్ లోహలో నిర్వహించిన బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేపట్టారు. మహారాష్ట్ర రాష్ట్రం లోని ప్రతి జిల్లాపరిషత్ లో గులాబీ జెండా ఎగరడమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు కెసిఆర్. బీఆర్ఎస్ ను మహారాష్ట్రలో కూడా రిజిస్టర్ చేయించామని వెల్లడించారు ముఖ్యమంత్రి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయనున్నట్లు తెలిపారు కెసిఆర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు సీఎం కెసిఆర్.

CM KCR sounds poll bugle in Maharashtra; BRS to contest local body polls -  Telangana Today

తమ ప్రాంతంలో సభ పెట్టాలని కోరుతూ మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి వినతులు వస్తున్నాయని తెలిపారు కెసిఆర్. తర్వాతి సభను షోలాపూర్ లో పెడతామని కేసీఆర్ వెల్లడించారు. నాందేడ్ లో తాము సభ పెట్టిన వెంటనే రైతుల ఖాతాల్లో రూ. 6 వేలు జమ చేశారని… బీఆర్ఎస్ సభ సత్తా ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని వ్యక్తపరిచారు ఆయన. రైతులు ఐక్యంగా ఉండి పిడికిలి బిగిస్తే న్యాయం జరుగుతుందని చెప్పారు. ఒకప్పుడు మహారాష్ట్ర కంటే తెలంగాణ దారుణంగా ఉండేదని… ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా మారిందని అన్నారు. మహారాష్ట్రలో సంపదకు కొదవ లేదని… అయితే దాన్ని ప్రజలకు ఇవ్వాలన్న ఆలోచన పాలకులకు లేదని చెప్పారు. రైతులు ఝలక్ ఇస్తే మొత్తం మారిపోతుందని అన్నారు.

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోందని కేసీఆర్ అన్నారు. దేశాన్ని 54 ఏళ్లు కాంగ్రెస్, 14 ఏళ్లు బీజేపీ పాలించి చేసిందేమీ లేదని సీఎం కెసిఆర్ మండిపడ్డారు. కృష్ణా, గోదావరి నదులు పుట్టే మహారాష్ట్రలో సాగు, తాగు నీరు చాలా చోట్ల అందుబాటులో లేదని అన్నారు ఆయన. పాలకులు మారుతున్నా ప్రజల తలరాత మాత్రం మారడం లేదని తెలిపారు. ఉల్లి, చెరుకు ధర కోసం రైతులు ప్రతిఏటా పోరాడాల్సిందేనని మండిపడ్డారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు మహారాష్ట్రలో అమలయ్యేంత వరకు తాను ఇక్కడకు వస్తూనే ఉంటానని తెలిపారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ కీలక నేత ఫడ్నవిస్ కు, తెలంగాణ పథకాలను మహారాష్ట్రలో అమలు చేస్తే ఇక్కడకు రానేరానని సవాల్ విసిరారు సీఎం కెసిఆర్.

 

 

Read more RELATED
Recommended to you

Latest news