పెద్దపల్లి పంచాయితీ… దాసరికి హ్యాండ్?

-

నెక్స్ట్ ఎన్నికల్లో కొందరు సిట్టింగులకు సీటు ఇస్తే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం గ్యారెంటీ అని ఆ మధ్య కొన్ని సర్వేలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రశాంత్ కిషోర్ అంతర్గత సర్వేలో కూడా ఇదే విషయం తేలిందని టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. అంటే వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు మళ్ళీ సీటు ఇస్తే టీఆర్ఎస్ ఓడిపోవడమే కాదు..ఈ సారి అధికారానికి కూడా దూరం కావాల్సి వస్తుందని తెలిసింది. అందుకే ఈ సారి కొందరు సిట్టింగులకు కేసీఆర్ సీటు ఇవ్వడం కష్టమని తేలింది.

ఇదే క్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి సైతం ఈ సారి సీటు దక్కడం కష్టమని సమాచారం. అసలు పెద్దపల్లి ప్రజలు ఏ పార్టీని కూడా వరుసగా రెండుసార్లు గెలిపించలేదు. కానీ గత రెండు ఎన్నికల్లో వరుసగా టీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. టీఆర్ఎస్ తరుపున దాసరి మనోహర్ రెడ్డి గెలిచారు. రెండు సార్లు గెలవడం, అలాగే రెండు సార్లు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది..దీంతో పెద్దపల్లిలో ఏదో పెద్ద మార్పు వచ్చేసిందని అనుకోవడానికి లేదు.

రెండు సార్లు గెలిచిన సరే దాసరి…పెద్దపల్లిలో చేసిన అభివృద్ధి అంతంత మాత్రమే అని తెలుస్తోంది. పైగా ఈయనపై ప్రతిపక్ష పార్టీలు అవినీతి ఆరోపణలు చేస్తున్నాయి. ఎమ్మెల్యే మనోహర్, ఆయన తమ్ముడు రమణారెడ్డి, విలేఖరి రవికిషోర్‌లు పోలీసుల అండతో బెదిరింపులకు పాల్పడుతూ, బ్లాక్‌మెయిల్ చేస్తూ జిల్లాలో దోపిడి చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆ మధ్య కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. అలాగే పెద్దపల్లిలో వ్యాపారులని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.

ఇవేగాక ఇంకా ఎమ్మెల్యే తమ్ముడుపై అనేక ఆరోపణలు వచ్చాయి…ఇవన్నీ ఎమ్మెల్యేగా బాగా మైనస్ అవుతున్నాయి..ఈ క్రమంలోనే నెక్స్ట్ దాసరికి సీటు ఇస్తే పెద్దపల్లిలో గెలవడం కష్టమని సర్వేలు చెబుతున్నాయి. దీంతో దాసరికి సీటు డౌటే అని తెలుస్తోంది. ఒకవేళ సీటు ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా అయిన దిగాలని దాసరి చూస్తున్నారని తెలుస్తోంది. మరి చూడాలి దాసరికి హ్యాండ్ ఇస్తారో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news