మూడు రాజధానుల అంశంలో కోర్టు జోక్యమా… అలాంటప్పుడు ఎన్నికలు ఎందుకు ? : ధర్మాన ప్రసాదరావు

-

మూడు రాజధానుల అంశంలో కోర్టు జోక్యం ఎందుకు… అలాంటప్పుడు ఎన్నికలు ఎందుకు అని ఇలదీశారు  ధర్మాన ప్రసాదరావు. ఏపీ అసెంబ్లీకి కొన్ని పరిమితులను పెడుతూ హైకోర్టు వ్యాఖ్యలు చేసిందని.. మూడు రాజధానులపై అసెంబ్లీ చట్టం చేయొద్దంటూ తెలిపిందని అసహనం వ్యక్తం చేశారు. హై కోర్టు తీర్పు తర్వాత సభానాయకుడికి లేఖ రాశానని.. కోర్టులంటే అందరికి గౌరవం ఉంది. అయితే దీనిపై సభలో చర్చించాల్సిన ఆవశ్యకత ఉందని భావిస్తున్నా అని చెప్పారు ధర్మాన ప్రసాద్‌రావు.

న్యాయ వ్యవస్థకు ముప్పు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కోర్టులదే అని సుప్రీంకోర్టు చెప్పింది. లేని అధికారాలను కోర్టులు సృష్టించుకోలేవని సుప్రీం తీర్పుల్లో స్పష్టంగా ఉందన్నారు. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ కాదు అన్న విషయాన్ని కోర్టులు గుర్తుపెట్టుకోవాలి. సమానమైన హక్కులు, అధికారాలు మూడు వ్యవస్థలకు కూడా ఉన్నాయి. న్యాయ వ్యవస్థలో స్వీయ నియంత్రణ ఉండాలని తీర్పులు ఎన్నో చెప్పాయని గుర్తు చేశారు ధర్మాన ప్రసాద్‌రావు.

ఒకవేశ శాసన వ్యవస్థ సరిగా పనిచేయకుంటే అది ప్రజలు చూసుకుంటారు.. అంతే కానీ శాసన వ్యవస్థ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. ఎంత నిగ్రహంతో కోర్టులు వ్యవహరించాలో కూడా సుప్రీంకోర్టు చెప్పిందని వెల్లడించారు. అధికార వ్యవస్థ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు గంతో చెప్పింది. సమాజం పట్ల పూర్తి బాధ్యత ఉందని సుప్రీంకోర్టు గతంలో ప్రకటించింది. జ్యుడీషియల్‌ యాక్టివిజం పేరుతో కోర్టులు విధులు నిర్వహించరాదని చెప్పిందని వెల్లడించారు ధర్మాన ప్రసాద్‌రావు.

Read more RELATED
Recommended to you

Latest news