ఎడిట్ నోట్: ఏపీ-తెలంగాణ ఒకేసారి!

-

ఏపీ-తెలంగాణలో ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయా? ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందా? అంటే ఇటీవల ఏపీలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే తెలంగాణతో పాటే ఎన్నికలు జరిగేలా ఉంది. అయితే ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక 2014లో రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

ఏపీలో టి‌డి‌పి, తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాయి. అయితే మళ్ళీ షెడ్యూల్ ప్రకారం 2019 ఎన్నికలు జరగాలి..కానీ తెలంగాణలో అధికారంలో ఉన్న కే‌సి‌ఆర్ ముందస్తు ఎన్నికలకు వచ్చారు. 2018 సెప్టెంబర్ లోనే ప్రభుత్వాన్ని రద్దు చేశారు. దీంతో అక్కడ డిసెంబర్ లో ఎన్నికలు జరగడం, మళ్ళీ బి‌ఆర్‌ఎస్ గెలవడం జరిగాయి. కే‌సి‌ఆర్ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సారి కూడా కే‌సి‌ఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని ప్రచారం జరుగుతూనే వచ్చింది. కానీ కేంద్రంతో సఖ్యత లేని కారణంగా కే‌సి‌ఆర్ ముందస్తుకు వెళ్ళే ప్లాన్ చేయడం లేదని అర్ధమైంది. అందుకే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లడానికి రెడీ అవుతున్నారు. అంటే 2023 సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఎన్నికల షెడ్యూల్ రావడం, డిసెంబర్ లో ఎన్నికలు జరగడం జరుగుతుంది. అంటే ఇక్కడ షెడ్యూల్ ప్రకారమే.

అయితే ఏపీలో 2019లో ఎన్నికలు జరిగాయి..అంటే అక్కడ షెడ్యూల్ ప్రకారం చూస్తే 2024లో ఎన్నికలు జరగాలి. కానీ ఇప్పుడు అక్కడ అధికారంలో ఉన్న జగన్ ముందస్తు ఎన్నికలకు ప్లాన్ చేశారని తెలుస్తోంది. అంటే తెలంగాణతో పాటు ఎన్నికలు జరిగేలా చూడాలని భావిస్తున్నారు. అంటే 2023 ఆగష్టు లేదా సెప్టెంబర్ లో ప్రభుత్వాన్ని రద్దు చేసి డిసెంబర్ లో ఎన్నికలకు వెళ్తారని అంటున్నారు.

అంటే ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం ఉంది. ఎన్నికలు ఎప్పుడొచ్చిన రెడీ అని ప్రతిపక్ష టి‌డి‌పి అంటుంది. అయితే జగన్ గాని ముందస్తుకు ప్లాన్ చేస్తే తెలంగాణతో పాటు ఏపీలో ఎన్నికలు జరుగుతాయి. లేదు అనుకుంటే 2024 ఏప్రిల్ లో జరుగుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news