ఎడిట్ నోట్: కారు-కాంగ్రెస్ దోస్తీ?

-

తెలంగాణ రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతాయో అర్ధం కాకుండా ఉంది. ఎప్పుడు ఏ పార్టీ రాజకీయంగా పైచేయి సాధిస్తుందో క్లారిటీ లేదు. పైకి ప్రతి పార్టీ తమదే పైచేయి అని అనుకుంటున్నాయి. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్తితులు లేవు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తుంది. కానీ ఈ సారి డౌట్ లేకుండా అధికారంలోకి వస్తామనే విషయాన్ని చెప్పలేక ఉంది. అటు బి‌జే‌పి సైతం అధికారంలోకి రావాలని చూస్తుంది..కానీ ఆ పార్టీకి అధికారం అనేది దూరంగానే ఉంది. ఇటు కాంగ్రెస్ పరిస్తితి అంతే.

ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ సారి ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ దాటదని, హాంగ్ వస్తుందని అన్నారు. అలాగే కేసీఆర్..కాంగ్రెస్ తో కలవాలని చూస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇక ఆ మాటని బీజేపీ గట్టిగా పట్టుకుంది..అదిగో బి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తాయని ప్రచారం చేస్తున్నారు. మరి తెలంగాణలో అదే పరిస్తితి ఉందా? అంటే చెప్పలేం.

ఎందుకంటే బి‌ఆర్‌ఎస్ పార్టీకి సొంతంగా అధికారంలోకి వస్తుందనే నమ్మకం పూర్తి స్థాయిలో కనిపించడం లేదు.  అందుకే కమ్యూనిస్టులని కలుపుకున్నారు. అటు ఎం‌ఐ‌ఎం ఎలాగో మిత్రపక్షంగా ఉంది. ఇదే సమయంలో హాంగ్ వస్తుందనే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో కలవాలని చూస్తుందని టాక్ మొదలైంది. ఎలాగో కే‌సి‌ఆర్..బి‌జే‌పి లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అటు కాంగ్రెస్ టార్గెట్ కూడా బి‌జే‌పినే. కాబట్టి బి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్ కలుస్తాయనే టాక్ నడుస్తోంది.

అయితే ఇది జాతీయ స్థాయిలో ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి గాని..తెలంగాణలో వర్కౌట్ అవ్వడం డౌటే. ఎన్నికల్లో మాత్రం బి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్ మాత్రం కలిసి పోటీ చేయవు..అందులో ఎలాంటి డౌట్ లేదు. ఒకవేళ ఎన్నికల తర్వాత హాంగ్ అసెంబ్లీ వస్తే మాత్రం అప్పుడేమైనా ఆలోచన చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే బి‌ఆర్‌ఎస్ – కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఉండదనే చెప్పాలి. ఇక హాంగ్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పి-కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. కాబట్టి ఎన్నికల్లో ఏదైనా జరిగే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news