ఎడిట్ నోట్: కాపులతో కేసీఆర్..పవన్‌కు చెక్.!

-

మళ్ళీ కేసీఆర్ ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెడుతున్నారా? టి‌ఆర్‌ఎస్ పార్టీని బి‌ఆర్‌ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి..ఏపీలో కూడా పార్టీ మొదలుపెట్టి కూడా..అక్కడ జగన్‌కు అనుకూలంగా రాజకీయం చేయాలని చూస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగన్ గెలుపుకు సహకరించాలని అనుకుంటున్నారా? అంటే తాజాగా కొన్ని మీడియాల్లో వస్తున్న కథనాలని బట్టి చూస్తే అది నిజమే అనిపిస్తుంది.

2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ తో చంద్రబాబు పొత్తు పెట్టుకుని..కే‌సి‌ఆర్‌ని ఓడించాలని చూశారు. కానీ అప్పుడు కే‌సి‌ఆర్ మళ్ళీ సత్తా చాటారు. బి‌ఆర్‌ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నారు. కానీ 2019 ఏపీ ఎన్నికల్లో అక్కడ చంద్రబాబుని దెబ్బతీయడానికి..జగన్‌కు సాకారం అందించారు. తెలంగాణ నేతలు..ఏపీకి వచ్చి జగన్ కు మద్ధతుగా చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అలాగే కే‌సి‌ఆర్..జగన్‌కు ఆర్ధికంగా కూడా సాకారం అందించారనే ప్రచారం వచ్చింది. మొత్తానికి బాబుకు కే‌సి‌ఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి..జగన్ గెలుపుకు సహకరించారు.

ఇక వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ జగన్‌ని గెలిపించడానికి కే‌సి‌ఆర్ తనవంతు కార్యక్రమాలు మొదలుపెట్టారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు ఎవరి జోలికి వెళ్ళడం లేదు. తన పని తాను చేసుకుంటున్నారు. కానీ ఏపీలో బాబు అధికారంలోకి వస్తే మళ్ళీ తమకు ఇబ్బంది అనుకున్నారో లేక..జగన్ అధికారంలోకి వస్తేనే బెటర్ అనుకున్నారో తెలియదు గాని..మొత్తానికి కే‌సి‌ఆర్..మళ్ళీ జగన్‌కు సహకారం అందించే దిశగా వెళుతున్నారట.

ఎలాగో ఏపీలో చంద్రబాబు, పవన్ కలుస్తున్నారు. పవన్‌కు కాపులు ఫుల్ సపోర్ట్ ఉన్నారు. దీంతో టి‌డి‌పికి కలిసొస్తుంది. అందుకే కాపుల ఓట్లు చీల్చేలా కే‌సి‌ఆర్ ప్లాన్ చేశారని తెలిసింది. ఈ క్రమంలోనే తాజాగా కొందరు కాపు అఫిషియల్స్ తో కే‌సి‌ఆర్ భేటీ అయినట్లు తెలిసింది. అదే సమయంలో దాదాపు పవన్..బాబుతో కలవకుండా చూసుకోవాలని, ఆ విధంగా రాజకీయం చేయాలని కే‌సి‌ఆర్ ప్లాన్ చేసినట్లు కథనం వచ్చింది. మరి ఈ కథనంలో ఎంతవరకు నిజముంది..కాపుల ఓట్లు ఎంతవరకు చీలుతాయి..టి‌డి‌పి, జనసేన పొత్తు ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news