ఎడిట్ నోట్: రాజకీయ ‘కక్ష’.!

-

రాజకీయ కక్ష..ఈ మాట ఇప్పుడు రాజకీయాల్లో ఎక్కువ వినిపించే మాట..అటు దేశ రాజకీయాల్లో గాని..ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో గాని ఈ రాజకీయ కక్ష అనేది వినిపిస్తూనే ఉంది. ఏమి లేదు అధికారంలో ఉన్న పార్టీలపై విమర్శలు చేస్తే చాలు..ప్రత్యర్ధి పార్టీలపై కక్ష సాధించడం అలవాటుగా మారిపోయింది. అధికారం చేతులో ఉండటంతో..వ్యవస్థలని వాడుకుని ప్రతిపక్షాలపై కక్ష సాధించడం కామన్ అయింది. ఈ రాజకీయ కక్ష గురించి అందరికీ తెలిసిపోయింది.

ఇక ఏపీలో ఏవిధంగా అధికార వైసీపీ..ప్రతిపక్ష టి‌డి‌పిపై రాజకీయ కక్ష సాధిస్తుందో ప్రత్యేకంగా చెప్పుకొనవసరం లేదు. అదే బాటలో తెలంగాణలో అధికారంలో ఉన్న బి‌ఆర్‌ఎస్..ప్రతిపక్షాలపై అదే మాదిరిగా కక్ష తీర్చుకుంటుందనే విమర్శలు ఉన్నాయి. ఈ విమర్శలు నిజమో కాదో..జనాలకు తెలుసు. కాబట్టి  అధికార పార్టీ కక్షపూరిత రాజకీయం గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే పలుమార్లు బి‌జే‌పి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, అటు టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..ఇంకా పలువురు ప్రతిపక్ష నేతల టార్గెట్ గా కే‌సి‌ఆర్ సర్కార్ కక్ష సాధింపు దిశగానే వెళుతుందని తెలుస్తోంది.

అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బి‌జే‌పి..తెలంగాణలోని కే‌సి‌ఆర్ టార్గెట్ గా ఏ విధంగా వెళుతుందో చెప్పాల్సిన పని లేదు. కాసేపు కేంద్రం విషయం పక్కన పెడితే..తాజాగా తెలంగాణలో తీన్మార్ మల్లన్న అరెస్ట్ జరిగింది. ఈయన అరెస్ట్ ఇదే తొలిసారి కాదు..గతంలో కూడా ఓ సారి జరిగింది. కే‌సి‌ఆర్ సర్కారుకు వ్యతిరేకంగా కథనాలు ఇస్తుండటంతో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది.

తాజాగా అదే పంథాలో అరెస్ట్ జరిగింది. ఇటీవల కొందరు దుండగులు తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేసిన విషయం తెలిసిందే. కార్యాలయంలోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దీనిపై తీన్మార్ మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పోలీసులు తీన్మార్ మల్లన్న కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. పలు కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్నతోపాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అంటే మల్లన్న ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియదు గాని..రివర్స్ లో మల్లన్నని అరెస్ట్ చేశారు. ఎస్ఓటీ పోలీసులపై దాడి కేసులో మల్లన్నతోపాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారని అంటున్నారు. ఈ కేసులో న్యాయస్థానం వీరికి 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. ఇంకా మల్లన్నపై పలు కేసులు పెడుతున్నారు.

ఇక టి‌ఎస్‌పి‌ఎస్‌సి పేపర్ లీకేజ్ కేసులో కే‌టి‌ఆర్ సన్నిహితుల హస్తం ఉందని అటు బండి సంజయ్, ఇటు రేవంత్ ఆరోపించారు. దీంతో పేపర్ లీకేజ్ కేసులో ఆధారాలు ఉంటే ఇవ్వాలని సిట్..బండి, రేవంత్ కు నోటీసులు ఇవ్వడం విశేషం..అదే కేసులో బి‌జే‌పి నేతల హస్తం ఉందని ఆరోపించిన కే‌టి‌ఆర్ కు నోటీసులు ఇవ్వలేదు. మరి దీన్నే రాజకీయ కక్ష అంటారని విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి అధికార పార్టి..ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతూనే ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news