ఇటీవల బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో ఎన్టీఆర్ భేటీ రాజకీయ దుమారం రేపుతోంది. అయితే.. తెలుగుదేశం పార్టీ పగ్గాలను జూనియర్ ఎన్టీఆర్ అందుకోవాలంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరి కోసమో, ఎవరో అడిగారని జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు తీసుకోరని కొడాలి నాని స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు కుప్పంలోనూ ఎదురుగాలి వీస్తోందన్నారు. చివరికి కుప్పంలో కూడా చంద్రబాబు పోరాడాల్సిన పరిస్ధితి వచ్చిందని పేర్కొన్నారు కొడాలి నాని. కుప్పంలోనూ చంద్రబాబు పీడ విరగడ అవుతుందని జోస్యం చెప్పారు కొడాలి నాని. జగన్ దెబ్బకు టీడీపీ, జనసేన, బీజేపీ కకావికలం కాకతప్పదని కొడాలి నాని వ్యాఖ్యానించారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని.. చంద్రబాబు పార్టీ, పవన్ పార్టీ పొత్తు పెట్టుకుంటాయని కొడాలి నాని ఆరోపించారు కొడాలి నాని. చంద్రబాబు కొత్త పార్టీ పెట్టుకుంటారన్న అర్ధంలో మాట్లాడారు కొడాలి నాని. రెండు పార్టీలను జగన్ చిత్తుచిత్తుగా ఓడిస్తారని ఆయన జోస్యం చెప్పారు కొడాలి నాని. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఉపయోగం లేకుంటే ఎవరితో నిమిషం కూడా మాట్లాడరని కొడాలి నాని అన్నారు. బీజేపీని విస్తరించేందుకే జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీ అయ్యారని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ మద్దతుతో బీజేపీని బలపర్చుకోవడానికి అమిత్ షా ప్రయత్నిస్తున్నారని తాను భావిస్తున్నట్టుగా కొడాలి నాని చెప్పారు.