ఏపీలో అత్యధికంగా ఉన్న కాపులు ఏకమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకాలం గెలుపోటములని డిసైడ్ చేస్తూ..వేరే వాళ్ళని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్న కాపులు..ఈ సారి అధికారం దక్కించుకోవాలని చూస్తున్నారు. అసలు ఏపీలో అత్యధిక ఓట్లు కాపు కులానికే చెందినవే. వారు ఇంతకాలం వేరే కులం చేతుల్లో ఉన్న పార్టీలని అధికారంలోకి తీసుకురావడానికి పనిచేశారు. కానీ ఈ సారి మాత్రం కాపుల చేతుల్లోనే అధికారం ఉండాలని డిసైడ్ అయ్యారు. ఆ దిశగానే ఏపీలోని కాపులు నేతలు ఒక చోట చేరారు.
అన్నీ పార్టీల్లో ఉన్న కొందరు కాపు నేతలు..తాజాగా హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. చిరంజీవి, పవన్ మాదిరిగా ఫెయిల్ అవ్వకుండా కాపులు అధికారం దక్కించుకోవాలని నిర్ణయించుకున్నారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్తితుల్లో వైసీపీ-టీడీపీలని దాటి పవన్ నేతృత్వంలోని జనసేన అధికారంలోకి రావడం జరిగే పని కాదు. పైగా కాపు నేతలు వైసీపీ-టీడీపీల్లోనే ఎక్కువ ఉన్నారు. ప్రాక్టికల్‌గా చూస్తే ఇదే నిజం. ఇప్పుడు ఆ రెండు పార్టీలని దాటి వేరే పార్టీని గెలిపించడం కష్టం.
అందుకే ప్రస్తుతానికి కాపు నేతలు ఒకటి డిసైడ్ అయ్యారు. ఎవరికి వారు వేరు వేరు పార్టీల్లో ఉన్నారు. అలా వేరే పార్టీల్లో ఉంటూనే కాపు కులానికి ఎక్కువ ప్రాధాన్యత దక్కేలా చూసుకోవాలని నేతలు డిసైడ్ అయ్యారు. ఇక అంతవరకు అంతా బాగానే ఉంది…కానీ ఈ సారి కాపులు ఎవరికి మద్ధతు తెలపాలనే విషయంపై కూడా కాస్త క్లారిటీ వస్తున్నట్లు కనిపిస్తోంది.
మెజారిటీ కాపు నేతలు వైసీపీకి యాంటీగానే పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఎలాగో కాపులు వైసీపీకి అనుకూలంగా పనిచేశారు. కానీ ఈ సారి ఆ పరిస్తితి కనిపించడం లేదు. పైగా పవన్ కల్యాణ్..టీడీపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఈ సారి టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి కాపులు కృషి చేసేలా ఉన్నారు. మరి చూడాలి ఏపీలో కాపుల రాజకీయం ఎలా ఉంటుందో?