Breaking : హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. ట్రాఫిక్ లో ఇరుక్కున ఫైరింజన్లు

-

హైదరాబాద్ మీర్ చౌక్ పీఎస్ పరిధిలోని దారుల్ షిఫా ప్రాంతంలోని ఓ టైర్ల షాపులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాత టైర్ల దుకాణం పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలడంతో మంటలు ఎగిసి పడ్డాయి. అయితే పక్కనే ఉన్న షాప్ కు మంటలు వ్యాపించడంతో టైర్లు మొత్తం కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. వారం రోజులుగా ట్రాన్స్ ఫార్మర్ నుండి ఆయిల్ లీక్ అవుతోందని ట్రాన్స్ కో అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని టైర్ల షాప్ యజమాని తెలిపాడు. అధికారుల నిర్లక్ష్యంగానే అగ్నిప్రమాదం జరిగి తాను రోడ్డున పడ్డానని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే.. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటన జరిగిన ప్రాంతానికి ఫైరింజన్లు చేరుకోగా.. ఆ టైర్ల దుకాణం దగ్గరికి మాత్రం వెళ్లలేకపోయాయి.

సమాచారం అందుకున్న వెంటనే ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చాదర్‌ఘాట్ ప్రధాన రోడ్‌ నుంచి ట్రాఫిక్‌ను వేరే రూట్లకు మళ్లించారు. దీంతో ప్రమాదం జరిగిన దుకాణం వద్దకు చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి ఫైరింజన్లు. అయితే.. అప్పటికే పెద్ద ఎత్తున మంటలు గోదాంను చుట్టుముట్టేశాయి. కాగా.. గోదాం పక్కనే ట్రాన్స్‌ఫార్మర్ కూడా ఉండటంతో.. స్థానికులు భయబ్రాంతులకు లోనవుతున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news