Breaking : బీఆర్‌ఎస్‌లో చేరిన ఒడిషా మాజీ సీఎం గిరిధర్‌ గమాంగ్‌

-

ఒడిశా మాజీ సీఎం, ఆ రాష్ట్ర సీనియర్‌ నేత, గిరిధర్‌ గమాంగ్‌ శుక్రవారం బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు. ఆయనతోపాటు ఒడిశాలోని కోరాపుట్‌ మాజీ ఎంపీ జయరాం పాంగి, బీజేపీ నేత, గిరిధర్‌ గమాంగ్‌ తనయుడు శిశిర్‌ గమాంగ్‌ సహ పెద్ద సంఖ్యలో నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ చేపట్టిన ఉద్యమంలో ఆయనతో కలిసి పనిచేసేందుకు అనేక రాష్ర్టాల నుంచి పలు పార్టీల నేతలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, మేధావులు ముందుకు వస్తున్నారు. బీజేపీ అనుసరిస్తున్న విద్వేష, వివక్షాపూరిత వైఖరిని ఎండగట్టగల సత్తా సీఎం కేసీఆర్‌లోనే ఉన్నాయని, మోదీని ఎదుర్కొనే శక్తియుక్తులు కేసీఆర్‌లోనే ఉన్నాయనే అభిప్రాయం దేశమంతా పరివ్యాప్తం అవుతున్న నేపథ్యంలో పలు రాష్ర్టాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు ఆయా రాష్ర్టాల్లోని ప్రాంతీయ పార్టీల నేతలు బీఆర్‌ఎస్‌ అధినేతతో సంప్రదింపులు, చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే.

 

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ నుంచి రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి తోట చంద్రశేఖర్‌, మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి పార్థసారథి, మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు బీఆర్‌ఎస్‌లో చేరారు. బీఆర్‌ఎస్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను పార్టీ అధినేత కేసీఆర్‌ నియమించారు. త్వరలో విశాఖపట్నంలో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ నిర్వహిస్తామని తోట చంద్రశేఖర్‌ వెల్లడించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news