కరోనాతో మరణించిన హెల్త్ వర్కర్లకు రూ. 50 లక్షలు : హరీష్‌ రావు

-

సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో వరల్డ్ గ్లూకోమ డే వారోత్సవాలు జరుగగా.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు మంత్రి హరీష్ రావు. కరోనాలో పని చేస్తూ మరణించిన ఏఎన్ఎమ్ వరలక్ష్మి అనే మహిళ కుటుంబానికి రూ. 50 లక్షలు రూపాయల ఇన్సూరెన్స్ చెక్ నను ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు అందించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… కరోనా మరణిస్తే హెల్త్ వర్కర్లకు రూ. 50 లక్షలు ఇస్తామని ప్రకటన చేశారు.

ప్రజలు గ్లూకోమ గురించి అవగాహన కల్పించాలని… ఈ వ్యాధి వచ్చినట్టు కూడా తెలియదన్నారు. ఈ వ్యాధి వస్తే కంటి చూపుని కొల్పయా ప్రమాదం అవసరమని… బిపి ,షుగర్ ఉన్న వాళ్లలో ఈ వ్యాధి ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 40 సంవత్సరాలు దాటి బిపి , షుగర్ ఉన్నవాళ్లలో 3 శాతం ఉందని.. సరోజినిదేవి కంటి ఆసుపత్రి పైన త్వరలో సమీక్ష సమావేశం నిర్వహిస్తానని తెలిపారు.

ప్రపంచంలోనే కంటి వెలుగు లాంటి కార్యక్రమం ద్వారా ప్రజలకు కంటి పరీక్షలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే చెందుతుందని.. కేసీఆరే కిట్ ద్వారా ప్రభుత్వ అసుపత్రులు పెద్ద ఎత్తున్న డెలివరీ సంఖ్య గణనీయంగా పెరిగాయా అని ప్రశ్నించారు. కరోనా లో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అద్భుతంగా పని చేసారని.. అక్కడక్కడ వృత్తిలో ప్రాణాలను కూడా కోల్పోయారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news