టీమిండియా విజయం..2-0తో వన్డే సిరీస్ కైవసం

-

రాయ్ పూర్ వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ పై 8 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. 109 పరుగుల లక్ష్యాన్ని రోహిత్ శర్మ సేన కేవలం 20.1 ఓవర్లలో 2 వికెట్ మాత్రమే నష్టపోయి అందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో రాణించగా..మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ 40 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా 2-0తో దక్కించుకుంది. సిరీస్ లో భాగంగా చివరి వన్డే ఈ నెల 27న జరగనుంది. అయితే.. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌.. 108 పరుగులకే ఆలౌట్ చేశారు భారత బౌలర్లు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నిర్ణయం సరైనదేనని నిరూపిస్తూ టీమిండియా బౌలర్లు షమీ (2), సిరాజ్ (1), శార్దూల్ ఠాకూర్ (1), హార్దిక్ పాండ్యా (2), కుల్దీప్ యాదవ్ (1), వాషింగ్టన్ సుందర్ (2) వికెట్ల వేట సాగించారు.

కివీస్ ఓ దశలో 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. అయితే తొలి వన్డే సెంచరీ హీరో మైకేల్ బ్రేస్వెల్ (22), గ్లెన్ ఫిలిప్స్ (36), మిచెల్ శాంట్నర్ (27) ఆదుకోవడంతో న్యూజిలాండ్ స్కోరు కనీసం 100 అయినా దాటింది.

ఫిన్ అలెన్ డకౌట్ కాగా, మరో ఓపెనర్ డెవాన్ కాన్వే 7, హెన్రీ నికోల్స్ 2, డారిల్ మిచెల్ 1, కెప్టెన్ టామ్ లాథమ్ 1, లాకీ ఫెర్గుసన్ 1, బ్లెయిర్ టిక్నర్ 2 పరుగులు చేశారు. హెన్రీ షిప్లే 2 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు.

Read more RELATED
Recommended to you

Latest news