గత ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో గెలిచింది..దానికి కారణం కేవలం జగన్ ఇమేజ్ మాత్రమే. ఆయన ఇమేజ్ వల్ల..అసలు కొన్ని స్థానాల్లో ఎమ్మెల్యేల పేర్లు తెలియకుండానే ప్రజలు వైసీపీకి ఓట్లు వేశారు. దాని వల్ల వైసీపీ అదిరిపోయే విజయం సొంత చేసుకుంది. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా జగన్ ఇమేజ్ మాత్రమే వైసీపీని కాపాడాలి. గత ఎన్నికలతో పోలిస్తే కాస్త డౌన్ అయిన..ఆధిక్యం మాత్రం తగ్గలేదు.
ఇప్పటికీ కొన్ని స్థానాల్లో జగన్ ఇమేజ్ ఏ మాత్రం డౌన్ అవ్వలేదు. విచిత్రం ఏంటంటే..వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది గాని..జగన్ పై వ్యతిరేకత పెద్దగా లేదు. దీంతో ఆ స్థానాల్లో టిడిపి బలపడలేదు. వైసీపీ బలహీనపడలేదు. ముఖ్యంగా ఎస్టీ రిజర్వడ్ స్థానాలు పూర్తిగా జగన్ ఇమేజ్ పైనే ఆధారపడి ఉన్నాయి. గత ఎన్నికల్లో ఏడు ఎస్టీ స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. పోలవరం, రంపచోడవరం, పాడేరు, అరకు, సాలూరు, కురుపాం, పాలకొండ స్థానాల్లో గెలిచింది.
వీటిల్లో సొంత ఇమేజ్ ఉన్న ఎమ్మెల్యేలు ఇద్దరే..పోలవరం, సాలూరు ఎమ్మెల్యేలకు ప్రజల్లో ఎక్కువ ఇమేజ్ ఉంది. మిగిలిన వారికి అంతగా ప్రజల బలం కనిపించడం లేదు..పైగా వారిపై వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తుంది. సరిగ్గా పనిచేయకపోవడం, సమస్యలు పరిష్కరించకపోవడం మైనస్ గా మారాయి. కానీ పథకాలు ఏజెన్సీ ప్రజలకు హెల్ప్ అవుతున్నాయి.
అందుకే అక్కడి ప్రజలు ఇప్పటికీ జగన్ పట్ల అభిమానంతో ఉన్నారు. దీని వల్ల ఆ స్థానాల్లో టిడిపి బలపడటం లేదు..ఇంకా ప్రజలు వైసీపీ వైపే ఉంటున్నారు. అంటే ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉన్నా సరే జగన్ ఇమేజ్ వల్ల మళ్ళీ ఆ స్థానాల్లో టిడిపికి భారీ షాక్ ఇచ్చి వైసీపీ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.