ఆత్మకూరులో జనసేన, బీజెపీల ఉమ్మడి అభ్యర్ధి పోటీ

-

ఆత్మకూరు ఉప ఎన్నికలో జనసేన, బీజెపీ బలపరచిన అభ్యర్ధిని పోటీలో పెడతామన్నారు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విష్ణువర్ధన్ రెడ్డి. 5 లక్షల ఆదాయం ఉన్న దేవాలయాల హక్కు యాజమన్యాలదే అని హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందని.. దేవాలయాల ఆస్తులపై ప్రభుత్వానిదే నిర్ణయం అని మంత్రి ఎలా అంటున్నారు ? అని నిలదీశారు. దేవాలయ మంత్రి మాయ మాటలు చెప్పవద్దని.. మసీదులలో మౌజన్లకు డబ్బులు, పాస్టర్లకు డబ్బులు.. దేవాలయాలపై ఎందుకు తేడా ?అని ప్రశ్నించారు.

దేవాలయాలలో హుండీల కలెక్కలు కూడా మీకు చెప్పాలి , ఇతర మతాలను ఎందుకు అడగరు ?
బిజెపీ అధికారంలోకి వస్తే.. చర్చిలు, మసీదుల మాదిరిగా దేవాలయాలను స్వేచ్ఛగా ఉంచుతామన్నారు. -గ్రూప్ – 1 అభ్యర్ధుల ఇబ్బందులపై గవర్నర్ కు లేఖ రాస్తాం.. ఏపీలో పెన్షన్లు, మంత్రులకు జీతాలు తప్ప ఏం చేస్తున్నారు ? అని నిలదీశారు. ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నారా? ఓట్లు కొనుక్కోవడానికే సీఎం జగన్ డబ్బులిస్తున్నారు.. అభివృద్ధి అంటే ప్రజల సొమ్ము ప్రజలకు పంచి ఓట్లు కొనుక్కోటమా ? అని అగ్రహించారు.

భూసేకరణ పేరుతో భూములు వైసీపీ నేతలకు కట్టబెడుతున్నారు.. అవినీతి యాప్ వైసీపీ నేతల అవినీతితో మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. ఏపీలో తమ‌ వాటా ఇవ్వలేక కేంద్ర‌ నిధులు వద్దంటున్నారు.. కర్నూలు మెడికల్ కళాశాల ఆస్తులను కూడా అమ్మేసే పరిస్ధితి తెచ్చారన్నారు. ఆత్మకూరు లో పోటీ చేస్తున్నాం.. ఇకపై ఏపీలో టీడీపీ, వైసీపీ కుటుంబ ప్రభుత్వాలు ఉండవన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news