బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొని ప్రసంగించారు. అయితే మోడీ ప్రసంగంపై ప్రశ్నాస్త్రాలు సంధించా మంత్రి కేటీఆర్.. దేశంలో రూపాయి పతనానికి కారణమేమిటో జవాబివ్వాలని ప్రధాని మోదీకి సూటి ప్రశ్న వేశారు మంత్రి కేటీఆర్. బీజేపీ సమావేశాలకు హాజరైన ప్రధాని మోదీపై ముఖ్యమంత్రి కేసీఆర్ పలు అంశాలపై ప్రశ్నలు సంధించిన నేపథ్యంలో ట్విట్టర్‌లో మస్ట్ ఆన్సర్ మోదీ అన్న హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌లో నెటిజన్లు వందలకొద్దీ ప్రశ్నలు వేశారు. మంత్రి కేటీఆర్ కూడా ఆదివారం అదే హ్యాష్‌ట్యాగ్‌తో మోదీని నిలదీశారు.
‘మోదీజీకి నా సూటి ప్రశ్న, భారత రూపాయి పతనమవడానికి కారణం ఏంటి..? బీజేపీకి చెందిన ఉత్తర కుమారులు ఎవరి దగ్గరైన ఈ ప్రశ్నకు సమాధానం ఉందా?’ అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. అంతేకాకుండా.. బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మార్చుతామని జార్ఖండ్ మాజీ సీఎం రఘుబర్‌దాస్ చేసిన ట్వీట్‌పై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. ‘అహ్మదాబాద్ పేరును అదానీబాద్‌గా మీరు ఎందుకు మార్చకూడదు’ అని మంత్రి కేటీఆర్ చురక అంటించారు. ఇంతకీ ఈ జుమ్లా జీవి ఎవరని ట్వీట్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.