నో డౌట్: బీజేపీలోకి వెంకన్న…కానీ ట్విస్ట్ ఉంది?  

-

దశాబ్దాల కాలం నుంచి కాంగ్రెస్ లో పనిచేస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీ వైపుకు వెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి…మునుగోడు ఉపఎన్నిక బరిలో నిలబడ్డారు. అక్కడ మళ్ళీ సత్తా చాటాలని పనిచేస్తున్నారు. అయితే తన తమ్ముడు బీజేపీలోకి వెళ్ళడంతో వెంకటరెడ్డి సైతం అటు వైపే వెళ్తారని ప్రచారం జరుగుతుంది. ఇంతకాలం కలిసి పనిచేసిన సోదరులు వేరు వేరు పార్టీల్లో ఉండటం జరిగే పని అని, వెంకటరెడ్డి మద్ధతు లేకుండా రాజగోపాల్ బీజేపీలో చేరడం కష్టమని అర్ధమవుతుంది.

కాకపోతే వెంకటరెడ్డి సైతం ఎప్పటినుంచో కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నారు…రేవంత్ రెడ్డికి పి‌సి‌సి పదవి వచ్చిన దగ్గర నుంచి ఆయన బీజేపీ పెద్దలతో టచ్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఎప్పుడు ఏదొక రకంగా రేవంత్ పై విమర్శలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల కాంగ్రెస్ నేతలు సైతం కొందరు వెంకటరెడ్డిపై విమర్శలు చేశారు.

పార్టీలో ఉంటే ఉండు లేకపోతే వెళ్లిపో అని మాట్లాడారు. దీనిపై రేవంత్ క్షమాపణ చెప్పాలని వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. అటు రేవంత్ సైతం క్షమాపణ చెప్పారు…అలాగే అద్దంకి దయాకర్ క్షమాపణ చెప్పారు. అయినా సరే రేవంత్ తనని అవమానిస్తున్నారని, తనని పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని, రేవంత్ రెడ్డిని పి‌సి‌సి పదవి నుంచి తప్పిస్తే పార్టీ బాగుపడుతుందని, రేవంత్ తో తాను వేదిక పంచుకోలేనని వెంకటరెడి..సోనియా గాంధీకి లేఖ రాశారు.

అయితే ఇదంతా తాను పార్టీ మారడంలో భాగంగా వేసుకున్న స్ట్రాటజీ అని విశ్లేషకులు అంటున్నారు. తనకు తానే పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేసుకుంటున్న ప్లాన్ అని తెలుస్తోంది. ఇక మునుగోడు ఉపఎన్నిక తర్వాత వెంకటరెడ్డి కాషాయ కండువా కప్పుకోవడం గ్యారెంటీ అని తెలుస్తోంది…ఒకవేళ ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి వస్తే…ఇలాగే కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ…రేవంత్ పై విమర్శలు చేస్తూ ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి వెంకన్న…బీజేపీలో చేరడం మాత్రం ఖాయమే…కానీ ఎప్పుడు అనేది క్లారిటీ లేదు.

Read more RELATED
Recommended to you

Latest news