తెలంగాణలో కరెంటు కోతలు లేవని..రాష్ట్ర వ్యాప్తంగా.. 24 గంటల పాటు ఉచిత కరెంటు ఇస్తున్నామని.. మంత్రి హరీష్ రావు ప్రకటన చేశారు. ప్రధాని మోడీ రాష్ట్రమైన గుజరాత్ లో కరెంటు కోతలు ఉన్నాయని చురకలు అంటించారు. మట్టి పనుల్లో రూ.25 వేల కోట్ల రూపాయల కోత పెట్టిన కేంద్ర ప్రభుత్వం ను కిషన్ రెడ్డి నిలదీయాలని.. తెలంగాణ కు EGS క్రింద EGS కూలీలకు 3 వేల కోట్ల పనిదినాలను తగ్గించడం పై కేంద్రాన్ని ప్రశ్నించాలని పేర్కొన్నారు.
కూలీల పై ప్రేమ ఉంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించినట్టు రాష్ట్రంలో పనిదినాలను 13 వేల కోట్ల నుండి 16 వేల కోట్ల కు పెంచేలా చూడాలని.. అన్ని వర్గాల ప్రజల నోట్లో మట్టి కొట్టి సిగ్గు లేకుండా పాద యాత్రలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ల రిజర్వేషన్ లు పెంచకుండా తొక్కి పెట్టినందుకా… వడ్ల కొననందుకా, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి నందుకా, వంట గ్యాస్ ధర మంట పెట్టినందుకా, నిరుద్యోగుల కు జాబ్ లు ఇవ్వనందుకా, ఎరువుల ధరలు విపరీతంగా పెంచినందుకా… ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో..చెప్పాలని బండి సంజయ్ ని నిలదీశారు. ముందు స్పష్టత ఇచ్చాకే పాదయాత్ర చేపట్టాలని.. అలా కాకుండా పాదయాత్రలు చేస్తే తెలంగాణ ప్రజలు దంచి కొడతారని హెచ్చరించారు.