రేవంత్ వెనుక బాబు..కోమటిరెడ్డి అదే రూట్?

-

తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అంశం ఒక సంచలనంగా మారిన విషయం తెలిసిందే…అలాగే ఆయన పార్టీకి రాజీనామా చేస్తూ…టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై ఫైర్ అయ్యారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి నాయకత్వంలో పనిచేయలేక పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. ఇక కోమటిరెడ్డికి వెంటనే రేవంత్ కౌంటర్ ఇచ్చేశారు. కాంట్రాక్టుల డబ్బుల కోసమే కాంగ్రెస్ ని వదిలి బీజేపీలోకి వెళుతున్నారని, ఈడీ కేసులతో సోనియా గాంధీని వేధిస్తున్న మోదీ, అమిత్ షా చెంతకు చేరుతున్నారని ఫైర్ అయ్యారు.

ఇక రేవంత్ వ్యాఖ్యలకు కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చేశారు..నాలుగు పార్టీలు మారి వచ్చిన రేవంత్ రెడ్డికి…తనని విమర్శించే హక్కు లేదని అన్నారు. అలాగే సోనియాగాంధీని తానెప్పుడూ అవమానపర్చలేదని, సోనియాను బలిదేవత అన్నది రేవంత్‌ ఒక్కడేనని, నాలుగు పార్టీలు మారిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని అన్నారు. అదే సమయంలో రేవంత్ వెనుక చంద్రబాబు ఉన్నారని, సీమాంధ్ర పెట్టుబడిదారులు ఉన్నారని, యెల్లో మీడియా కూడా ఉందని కోమటిరెడ్డి ఊహించని కామెంట్స్ చేశారు.

చంద్రబాబు సపోర్ట్ తోనే రేవంత్ పనిచేస్తున్నారని, తెలంగాణని దోచుకోవడానికి చూస్తున్నారని ధ్వజమెత్తారు. పీసీసీ పదవిని రేవంత్‌ డబ్బులతో కొన్నారని,  తెలంగాణలో పక్కా ప్లాన్‌ ప్రకారం టీడీపీని ఖతం చేశారని, రేవంత్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి  చంద్రబాబుకు ఇచ్చారని, ఉప ఎన్నికకు భయపడి ఉత్తుత్తి రాజీనామా చేశారని కోమటిరెడ్డి గుర్తు చేశారు. తాను ధైర్యంగా రాజీనామా చేసి ముందుకెళ్తానని, తన వెనుక మునుగోడు ప్రజలు ఉన్నారని అంటున్నారు. బీజేపీతో కాంట్రాక్టు తీసుకున్నట్లు నిరూపించాలని రేవంత్‌ రెడ్డికి సవాల్‌ విసిరారు.

మొత్తానికి కోమటిరెడ్డి  టార్గెట్ మొత్తం రేవంత్ రెడ్డి అన్నట్లే ఉంది. టోటల్ గా రేవంత్ రెడ్డికి చెక్ పెట్టడానికే కోమటిరెడ్డి ప్రయత్నిస్తున్నట్లు ఉంది. అలాగే గతంలో టీఆర్ఎస్ చేసినట్లుగానే…రేవంత్ వెనుక బాబు ఉన్నారని అంటున్నారు. అంటే దీని వల్ల రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మరని కోమటిరెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మునుగోడులోని కాంగ్రెస్ శ్రేణులు తనవైపు రావడానికి కోమటిరెడ్డి ఈ రకమైన స్ట్రాటజీతో ముందుకొచ్చినట్లు కనిపిస్తోంది.

అయితే ఇంతకాలం..రేవంత్ పై కోమటిరెడ్డి విమర్శలు చేయలేదు. 2018లో టీడీపీతో పొత్తు ఉండగానే…కోమటిరెడ్డి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మరి అప్పుడే టీడీపీతో పొత్తు వద్దని, లేదా కాంగ్రెస్ ని వీడటం గాని చేయలేదు. ఇప్పుడు మునుగోడు ఉపఎన్నికని దృష్టిలో పెట్టుకునే కోమటిరెడ్డి….చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news