బీఆర్ఎస్‌కు 100 సీట్లు..కానీ ట్విస్ట్ ఉందట!

-

తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం మూడు ప్రధాన పార్టీలు తీవ్రంగా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఓ వైపు అధికార బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తుంది. అటు ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ సారైనా అధికారంలోకి రావాలని చూస్తుంది. ఇక తొలిసారి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని చూస్తుంది. ఇలా మూడు పార్టీలు అధికారం కోసం కష్టపడుతున్నాయి. అలాగే ఎవరికి వారు అధికారంలోకి వచ్చే విషయంలో ధీమాగా ఉన్నారు.

Errabelli Dayakar Rao : అలా చెప్పిన బీజేపీ పార్టీకి సిగ్గు లేదా.. - NTV Telugu

ఈ సారి 90 సీట్లు పైనే గెలిచి అధికారంలోకి వస్తామని గులాబీ పార్టీ..మిషన్-90 టార్గెట్ తో కాషాయ పార్టీ, 72 సీట్లు గెలుచుకుని తాము ఈ సారి అధికారం దక్కించుకుంటామని కాంగ్రెస్ అంటుంది. ఇలా మూడు పార్టీలు అధికారంలోకి వచ్చే విషయంలో ధీమాగా ఉన్నాయి. ఇదే సమయంలో తాజాగా బీఆర్ఎస్ పార్టీ 100 సీట్లు గెలుచుకుంటుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అయితే ఇక్కడొక ట్విస్ట్ ఇచ్చారు.

తమ పార్టీలో ఓ 20 మంది ఎమ్మెల్యేలని పక్కన పెడితే..అంటే వారికి సీట్లు ఇవ్వకుండా వేరే వాళ్ళకు సీట్లు ఇస్తే 100 సీట్లు గెలవడం ఖాయమని, లేదంటే 80 సీట్లు గెలుస్తామని అంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి 20-25 సీట్లు వస్తాయని, బీజేపీకి 15-20 సీట్లు వస్తాయని అంచనా వేశారు. 6 జిల్లాల్లో కాంగ్రెస్‌తో తమకు పోటీ ఉంటుందని, నాలుగు జిల్లాల్లో బీజేపీతో పోటీ ఉంటుందని అంటున్నారు.

అయితే ఇప్పుడున్న పరిస్తితుల్లో ఎవరి ధీమా వారికి ఉన్నా సరే..గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉంది. బీఆర్ఎస్ 80 సీట్లు గెలవడం కష్టమే..కాకపోతే ప్రస్తుతానికి ఆ పార్టీనే లీడ్ లో ఉందని తెలుస్తోంది. ఇటు నెక్స్ట్ పొజిషన్ కాంగ్రెస్, మూడో స్థానంలో బీజేపీ ఉందని కొన్ని సర్వేలు చెబుతుండగా, కొన్ని సర్వేలు ఏమో రెండో స్థానంలో బీజేపీ, మూడో స్థానంలో కాంగ్రెస్ ఉన్నాయని చెబుతున్నాయి. చూడాలి మరి చివరికి అధికారం ఎవరికి దక్కుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news