బాబు ‘బోరు’..మారడం కష్టమేనా?

-

టీడీపీ అధినేత చంద్రబాబు…రాజకీయ చాణక్యుడు అని ఒకప్పుడు పేరు ఉండేది…ఆయన వ్యూహాలు వేస్తే ప్రత్యర్ధులతో చిత్తు అయ్యేవారు..అయితే ఇదంతా ఒకప్పుడు…ఇప్పుడు బాబు చాణక్యం పనిచేయడం లేదు…ఆయన వ్యూహాలు వర్కౌట్ కావడం లేదు. కాలానికి తగ్గట్టుగా మారి రాజకీయం చేయడంలో బాబు విఫలమవుతున్నట్లే కనిపిస్తోంది…ఇప్పటికే బాబు ప్రజలని ఆకర్షించేలా మాట్లాడటంలో ఫెయిల్ అవుతున్నట్లే కనిపిస్తోంది. ప్రత్యర్ధులకు చెక్ పెట్టడానికి అవే పాత వ్యూహాలు అమలు చేస్తున్నారు…అలాగే ప్రజలని ఆకర్షించడానికి అదే పాత చింతకాయపచ్చడి లాంటి స్పీచ్ లు ఇస్తున్నారు.

ఇంకా అదే తరహాలో మాట్లాడటం వల్ల ప్రజలు బాబు స్పీచ్ లు వినడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈరోజుల్లో ప్రజలకు తగ్గట్టుగా మాట్లాడాలి తప్ప…ఏదో లెక్చరర్ మాదిరి లెక్చర్ ఇస్తే..జనం వినలేరు. పైగా బాబు…ఎక్కడా చూసిన తన డప్పు తానే కొట్టుకుంటున్నారు. ఇటీవల జరిగిన మహానాడు కావొచ్చు..మినీ మహానాడులు కావొచ్చు..అదే బోరు స్పీచ్ లతో ప్రజలకు బోరు కొట్టిస్తున్నారు. ఎప్పుడు మాదిరిగానే జగన్ పై విమర్శలు…అలాగే తాను అది చేశానని , ఇది చేశానని డప్పు కొట్టుకోవడం చేస్తున్నారు.

ఎప్పుడు ఒకే తరహా విమర్శలు చేయడం వల్ల ప్రజలకు పెద్దగా వినడానికి ఓపిక ఉండదు..అలాగే తానే ఐటీ తెచ్చాను…సైబరాబాద్ కట్టాను..డ్వాక్రా పెట్టాను..గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను..రోడ్లు వేశాను..బిల్డింగులు కట్టాను అంటూ…చెప్పిందే చెప్పిందే పదే పదే చెబుతున్నారు. అలాగే 2003లో తిరుపతిలో తనపై జరిగిన బాంబుల దాడి గురించి…ప్రతి సభలోనూ చెబుతూ వస్తున్నారు…అదే విధంగా పోలీసులపై కామెంట్ చేయడం…అలాగే జనాలకు రోషం లేదంటూ…పదే పదే మాట్లాడుతున్నారు.

జగన్ పన్నుల భారం పెంచిన జనం తిరగబడటం లేదని, తామే పోరాడతామని, జనం ఇంట్లో కూర్చుంటున్నారని, రోషం లేదని అంటున్నారు. ఇక ఈ విధంగా ఎప్పుడు చెప్పే మాటలని రిపీట్ చేస్తూ వస్తున్నారు. దీని వల్ల జనం మద్ధతు పెరగడం కంటే తగ్గుతుందని చెప్పొచ్చు..కాబట్టి ఇప్పటికైనా బాబు తన పంథా మారిస్తే బెటర్…లేదంటే బాబునే జనం మార్చేస్తూ ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news